Begin typing your search above and press return to search.
కేసీఆర్ అలా అనేస్తుంటే.. రిపోర్టర్లు మౌనంగా ఉండటమా?
By: Tupaki Desk | 9 Nov 2021 9:37 AM GMTప్రశ్నించే గొంతుక గా పాత్రికేయుల్ని అభివర్ణిస్తుంటారు. మరి.. అలాంటి ప్రశ్నించే గొంతు ను సైతం ఇష్టా రాజ్యంగా మాటలు అనేయటం.. తనకున్న అధికారాన్ని గుర్తు కు తెచ్చేలా మాటలు అనేయటం దేనికి నిదర్శనం? గడిచిన రెండు రోజులు గా ప్రెస్ మీట్లను నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. తాను చెప్పాల్సింది చెప్పేసిన తర్వాత.. ప్రశ్నలు అడిగే సీనియర్ రిపోర్టర్ల ను ఇష్టం వచ్చినట్లు గా అనేస్తున్న వైనం ఇప్పుడు మరో సారి చర్చ కు తెర తీస్తోంది.
ప్రశ్నించటం తమ విధి. దాని కి సమాధానం చెప్పటం ప్రజా సేవకుడిగా సీఎం హోదా లో ఉన్న కేసీఆర్ బాధ్యత. అంతే కానీ ప్రశ్నలు వేస్తున్న రిపోర్టర్లను కించ పరిచేలా.. వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం సరైనది కాదు. మీడియా ఇంత భారీగా పెరిగి పోయి.. ప్రెస్ మీట్ అంటేనే దగ్గర దగ్గర యాబై మందికి పైనే హాజరువుతున్న వేళ లో.. సీఎం నోటి నుంచి వస్తున్న వ్యాఖ్యల పై సరైన రీతి లో రియాక్టు కాలేకపోతున్నారన్న మాట వినిపిస్తోంది.
దీనికి తోడు.. ఉద్యోగులుగా ఉన్న జర్నలిస్టులు.. తాము స్వతంత్రించి సీఎం కేసీఆర్ మాటలకు అభ్యం తరం వ్యక్తం చేస్తే.. తాము పని చేసే మీడియా సంస్థ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న సందేహం కూడా వెనక్కి తగ్గటానికి.. మాటలు అని పించుకోవటానికి కారణమని అంటున్నారు. దీనికి తోడు.. ఇటీవల కాలం లో వెన్నుముక లేని రిపోర్టర్లు ఎక్కువ కావటం తో.. భజన తప్పించి ప్రశ్నించే తత్త్వాన్ని కోల్పోతున్నట్లు గా చెబుతున్నారు.
ప్రశ్నలు వేయాల్సిన పాత్రికేయులే రాజీ పడితే.. ప్రజల గొంతుకగా ఎవరు ఉంటారు? గతం లో పాత్రికేయులు సంధించే ప్రశ్నలకు అధికారపక్షంలో ఉన్న ఏ స్థాయి వారైనా సమాధానం చెప్పేందుకు జంకేవారు. దీనికి కారణం.. గతం లో రిపోర్టర్లుగా పని చేసేవారి వ్యక్తిత్వం కూడా అలానే ఉండేదని చెబుతారు. ఇక్కడ మా ఉద్దేశం.. ఇప్పుడు రిపోర్టర్లు గా పని చేసే వారి వ్యక్తిత్వాన్ని శంకించటం లేదు. కాకుంటే.. గతం లో మాదిరి పాత్రికేయాన్ని ప్రాణంగా కాకుండా.. పనిగా.. జస్ట్ ఒక ఉద్యోగంగా చూడటం కూడా ఈ దుస్థితికి కారణమని చెప్పక తప్పదు. రిపోర్టర్లను చిన్నబుచ్చేలా.. వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా వ్యవహరంచే తీరుకు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన కూడా తెలపలేని ఆశక్తత దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇలాంటి తీరుకు.. యాజమాన్యాల వైఖరి లో వచ్చిన మార్పులు కూడా అని చెప్పక తప్పదు. గతంలో మీడియా సంస్థల్ని ఒక సిద్ధాంతం కోసం.. ప్రజల తరఫున పోరాడే ఒక మాధ్యమం గా భావించే వారు యజమానులు గా ఉండేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం.. మీడియాను పూర్తి స్థాయి వాణిజ్యం గా భావిస్తునన యజమానుల పుణ్యమా అని పాత్రికేయుడి గొంతు పూడుకుపోయేలా చేస్తుందంటున్నారు.
ప్రజాస్వామ్యం లో నాలుగో స్తంభంగా ఉండే పాత్రికేయటం.. అధికారానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారికి జీ హుజూర్ అన్నట్లు వ్యవహరించటం తప్పే అవుతుంది. ప్రజల గొంతు ను వినిపించాల్సిన స్థానం లో ఉన్న తమను చులకన చేస్తుంటే చేష్టలుడిగినట్లుగా ఉండిపోవటం సరి కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మీడియాను చులకన చేసేలా వ్యాఖ్యలు చేసే వారి విషయంలో ఇప్పటికైనా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం పాత్రికేయ వర్గాలకు ఉందన్నది మర్చిపోకూడదు. లేకుంటే.. రానున్న రోజుల్లో మర్యాద అన్నది లేకుండా పోవటమే కాదు.. ప్రజల ఆత్మాభిమానం కోసం.. వారి హక్కుల కోసం పోరాడతామని చెప్పే మాటలన్ని జోకులు గా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నది మర్చిపోకూడదు.