Begin typing your search above and press return to search.

ఆ మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌దా? హూస్టింగ్ మరియు పోస్టింగ్

By:  Tupaki Desk   |   14 Feb 2022 8:30 AM GMT
ఆ మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌దా? హూస్టింగ్ మరియు పోస్టింగ్
X
జూన్ లో క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉంటుంది.జూన్ లో పెద్ద‌ల స‌భ‌ల ఎన్నిక‌లు ఉన్నాయి.ఈ రెండూ కీల‌కం కానున్నాయి.ఇంకా ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల శాస‌న మండ‌లి (ఎమ్మెల్సీ) ఎన్నిల‌కలు కూడా ఉన్నాయి.వీట‌న్నింటితో పాటు ఇంకొన్ని ప‌రిణామాలు కూడా ముడిప‌డి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క్యాబినెట్ విస్త‌ర‌ణ అన్న‌ది జ‌గ‌న్ చేప‌డితే వ‌చ్చే మార్పులేంటి అన్న‌ది ఒక్కసారి చూద్దాం.

క్యాబినెట్ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ అన్న‌ది ఉంటే కృష్ణ‌దాసును త‌ప్పించ‌డం ఖాయం.పైకి ఆయ‌న గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా అది మాత్రం ఎంత మాత్రం నిజం కాద‌ని తేలిపోనుంది.ఆయ‌న స్థానంలో కాళింగ సామాజిక‌వ‌ర్గంకు చెందిన స్పీక‌ర్ సీతారాం సీన్ లోకి వ‌స్తారు. లేదా అదే వెల‌మ సామాజిక‌వ‌ర్గంకు చెందిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ప‌ద‌వి ఇవ్వ‌వచ్చు.కానీ ఆయ‌న వ‌ద్దంటున్నారు.

ఇక నోటి దుర‌ద మంత్రులు కొడాలి నాని, సీదిరి అప్ప‌ల్రాజును త‌ప్పించి కొత్త వాళ్ల‌కు ఛాన్స్ ఇస్తారు.వాళ్ల‌ను పార్టీ ప‌ద‌వుల‌కు ప‌రిమితం చేస్తారు.అదేవిధంగా ఉత్త‌రాంధ్ర కోడ‌లు డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ‌వాణిని త‌ప్పిస్తారు. ఆవిధంగాఇద్ద‌రు డిప్యూటీ సీఎంల‌ను త‌ప్పిస్తారు. కానీ పెద్దిరెడ్డిని కొన‌సాగిస్తారు. అదే జిల్లాకు చెందిన నారాయ‌ణ స్వామిని కూడా త‌ప్పిస్తారు. అంటూ 3 డిప్యూటీ సీఎంల‌కు ప‌ద‌వీ గండం త‌ప్ప‌ద‌ని తేలిపోనుంది త్వ‌ర‌లో..ఇవ‌న్నీ ప్రాథ‌మిక స‌మాచారం అనుసారం రాస్తున్న‌వి వీటిలోకొన్ని నిర్థార‌ణ‌లో కూడా ఉన్నాయి.

ఇక టీచ‌ర్ల రాజకీయం మళ్లీ మొద‌లైతే జ‌గ‌న్ కు మ‌ళ్లీ పీఆర్సీ గొడ‌వ‌లు త‌ప్ప‌వు.అందుకే టీచ‌ర్ల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాల్లో క్యాబినెట్ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్. అయితే ఆశించిన రీతిలో పీఆర్సీ సాధించుకుని రాలేక‌పోతే త‌మ ప‌రువు పోతుంద‌న్న భావ‌న‌లో ఇప్ప‌టికీ ఉపాధ్యాయ సంఘాల నాయ‌క‌త్వాలు ఉన్నాయి.వీటికి క‌మ్యూనిస్టు పార్టీల అండ‌దండ‌లున్నా కూడా ఇప్ప‌టికిప్పుడు పీఆర్సీలో మార్పుల‌యితే రావు.

ఆఖ‌రుగా పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌లకు సంబంధించి వైసీపీ కోటాకు 4 సీట్లు ద‌క్క‌నున్నాయి.నిబంధ‌న‌ల అనుసారమే ఇవి ద‌క్క‌నున్నాయి.వీటిని కిల్లికృపారాణితోనూ, సినీ న‌టుడు అలీతోనూ, సాయిరెడ్డితోనూ భ‌ర్తీ చేయొచ్చు. ఒక్కస్థానంకు సంబంధించి చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. అదానీ గ్రూపున‌కు చెందిన వ్య‌క్తుల‌కు ఈ ప‌ద‌వి ద‌క్కే ఛాన్స్ ఉంది ఇది కూడా వెరీ హైపోథిటిక‌ల్ వే లో చెబుతున్న స‌మాచార‌మే!