Begin typing your search above and press return to search.
ఆ రాష్ట్రాలకు మించి మనం ఏదైనా చేయాలి కేసీఆర్?
By: Tupaki Desk | 21 May 2021 4:41 AM GMTకరోనా మహమ్మారి కారణంగా చోటు చేసుకుంటున్న విపరిణామాలు అన్ని ఇన్ని కావు. అంచనాలకు అందని రీతిలో చోటు చేసుకుంటున్న సామాజిక చిత్రంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కరోనా కాటుకు బలైన తల్లిదండ్రుల కారణంగా చిన్నారులు.. పిల్లలు అనాధలవుతున్నారు. ఒక్కసారి బాధ్యతల భారం మీద పడుతోంది. ఒకవైపు కనురెప్పల్లాంటి తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని పుట్టెడు శోకంలో ఉన్న వారికి.. బతుకు బండిని ఎలా లాగాలో తెలీని పరిస్థితి.
ఇలాంటి ఉదంతాలు అన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి వారు రెండులక్షలకు పైనే ఉన్నట్లు చెబుతున్నారు. అధికారిక సమాచారానికి అనధికారిక సమాచారానికి పొంతన ఉండదన్న విషయం తెలిసిందే. ఇవాల్టి రోజున ఒక రాష్ట్రం కరోనా మరణాలు పది అని చూపిస్తే.. వాస్తవంలో ఏ వందో.. నూటయాభైయ్యో అంతకంటే ఎక్కువగానే ఉన్నాయన్నది మర్చిపోకూడదు.
తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల విషయంలో కొన్ని రాష్ట్రాలు మిగిలిన వారి కంటే భిన్నంగా స్పందిస్తున్నాయి. ఇలాంటి వారి కోసం తమదైన సాయాన్ని అందిస్తున్నాయి. ఏపీలో ఇలాంటి బాధిత చిన్నారుల పేరిట రూ.10లక్షలు డిపాజిట్ చేస్తోంది జగన్ సర్కారు. మధ్యప్రదేశ్ లో అయితే ఉచిత విద్య.. రేషన్.. ప్రతి నెల రూ.5వేల పెన్షన్ ఇస్తోంది. ఢిల్లీ రాష్ట్రంలో ఉచిత విద్యతో పాటు.. ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఒడిశాలో పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం మాటేమిటి? అన్నది ప్రశ్నగా రావొచ్చు.
తెలంగాణలో ఇలాంటి బాధిత చిన్నారుల్ని బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పించటం.. ఉన్నత చదువుల కోసం గురుకులాల్లో ప్రవేశాలు కల్పించటం చేస్తున్నారు. ఇవి కాకుండా వారికి ఆర్థికంగా దన్నుకలిగేలా.. వారి జీవితాల్లో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న లోటును ఎప్పటికి తీర్చలేని నేపథ్యంలో.. వారి భవిష్యత్తుకు బెంగ లేకుండా ఉండేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించాలన్న మాట వినిపిస్తోంది. కొన్నింటి విషయాల్లో భారీగా స్పందించే కేసీఆర్.. తల్లిదండ్రుల్ని కరోనా కాటుకు పోగొట్టుకున్న పిల్లల జీవితాలకు కొత్త వెలుగులు నింపేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి.. సారు ఏం చేస్తారో చూడాలి.