Begin typing your search above and press return to search.

టీటీ ప్లేయర్ కి షోకాజ్ నోటీసులు..ఒలింపిక్స్‌ లో అలా చేసిందంట !

By:  Tupaki Desk   |   5 Aug 2021 7:35 AM GMT
టీటీ ప్లేయర్ కి  షోకాజ్ నోటీసులు..ఒలింపిక్స్‌ లో అలా చేసిందంట !
X
టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రౌండ్‌ లోకి ప్రవేశించిన మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మానికా బత్రా, పోరాటం మధ్యలోనే ముగిసింది. మూడో రౌండ్‌ లో ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవాతో జరిగిన మ్యాచ్‌ లో 4-0 తేడాతో ఓడి, టోర్నీ నుంచి నిష్కమించింది. 2006 కామన్వెల్త్ గేమ్స్‌ లో టీమ్ ఈవెంట్‌ లో స్వర్ణం సాధించిన ‘అర్జున అవార్డు’ గ్రహీత సౌమ్యదీప్ రాయ్, జాతీయ టీటీ కోచ్‌ గా ఉన్నారు. ఒలింపిక్స్‌ లో కూడా ఆయనే టీటీ కోచ్‌ గా వ్యవహరించారు. టోక్యో ఒలింపిక్స్‌ లో భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా,మూడో రౌండ్‌ లో ఓడిన విషయం తెలిసిందే.

టీటీలో పోటీపడిన మిగిలిన ప్లేయర్లు టైమ్ అవుట్‌ లో కోచ్‌ ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటుంటే, మానికా బత్రా మాత్రం ఒంటరిగా పోరాడింది. బ్రేక్ సమయంలోనూ ఆమె ఒంటరిగా కనిపించింది. టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌ లో శరత్ కమల్‌ తో కలిసి బరిలో దిగింది మానికా బత్రా. అయితే భారీ అంచనాలున్న ఈ జోడీ, తొలి రౌండ్‌ లోనే ఓడి నిరాశగా వెనుదిరిగింది. మానికా బత్రా, తన మిక్స్‌డ్ డబుల్ ఆటగాడైన శరత్ కమల్ శిక్షణలోనే రాటుతేలింది. శరత్ కమల్ కోచింగ్‌ లోనే ఈ జోడి ఆసియా క్రీడల్లో అదరగొట్టాడు. మిక్స్‌డ్ డబుల్స్‌ తో పాటు మహిళల సింగిల్స్‌ లోనూ పతకాలు సాధించారు. అయితే నేషనల్ గేమ్స్‌ లో మానికా బత్రాను ఓడించిన సుత్రీతా ముఖర్జీ, సౌమ్యదీప్ శిక్షణలో ఆడుతోంది.

సౌమ్యదీప్ రాయ్, ప్రస్తుతం జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్‌ గా ఉన్నారు. అయితే ఒలింపిక్స్‌ లో కోచ్ సలహాలు తీసుకోవడానికి ఇష్టపడని మానికా బత్రా... నేషనల్ కోచ్ సౌమ్యదీప్‌ ను సుత్రీతా కోచ్‌ గా పేర్కొంది. ఈ కామెంట్లపై టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీరియస్‌ అయ్యింది. మానికా బత్రా కోచ్ సలహాలు తీసుకోకూడదనుకోవడంలో తప్పులేదు. అయితే సౌమ్యదీప్‌ ను పర్సనల్ కోచ్‌ గా పేర్కొనడం మాత్రం చాలా తప్పు. సుత్రీత, సౌమ్యదీప్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. కానీ అతను నేషనల్ కోచ్, మానికా బత్రా పర్సనల్ కోచ్‌ కోసం అప్లై చేసింది. మేం కూడా రికమెండ్ చేశాం. అయితే టోక్యోలో ఉన్న నిబంధనల కారణంగా ఒకే కోచ్‌ ను అనుమతించారు, కోచ్ కోసం చేసుకున్న అప్పీలు, ఆఖరి నిమిషంలో రద్దు కావడంతో మానికా బత్రా ఫీల్ అయ్యింది. మనిక వ్యక్తిగత కోచ్‌ సన్మయ్‌ పరాంజపేకు ఒలింపిక్స్‌ పోటీలు జరిగే ప్రదేశంలో ప్రవేశించడానికి అవసరమైన అక్రిడేషన్‌ కార్డు లేకపోవడంతో మనిక ఆడే మ్యాచ్‌ లకు అతడు దూరంగా ఉన్నాడు.

ఆ సమయంలో సౌమ్యదీప్‌ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించినా, మనిక పట్టించుకోలేదు. దీంతో పరాంజపే కార్డు అప్‌గ్రేడ్‌ చేయాలని మనికా డిమాండ్‌ చేసింది. కానీ నిబంధనల ప్రకారం అది కుదరలేదు. సౌమ్యదీప్‌ సలహాలు తీసుకోమని చెప్పగా.. సుతిర్థా ముఖర్జీకి ఆయన ఒకప్పుడు వ్యక్తిగత కోచ్‌గా ఉన్నారంటూ మనికా అందుకు నిరాకరించింది. ఎగ్జిక్యూటీవ్ బోర్డు త్వరలో వీడియో సమావేశంలో పాల్గొని, మానికా బత్రాపై క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకుంటాం , అంటూ తెలిపాడు భారత టీటీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ బెనర్జీ. టోక్యో ఒలింపిక్స్ కోసం సౌమ్యదీప్ రాయ్, ఢిల్లీలో మూడు నెలల పాటు టీటీ కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్యాంపుకి రావడానికి ఇష్టపడని మానికా, మరో మూడు రోజుల్లో క్యాంపు ముగుస్తుందనగా చేరినట్టు సమాచారం.