Begin typing your search above and press return to search.

క‌రోనా అల‌ర్ట్ః మీరు మందు తాగుతారా?

By:  Tupaki Desk   |   9 May 2021 1:30 PM GMT
క‌రోనా అల‌ర్ట్ః మీరు మందు తాగుతారా?
X
దేశంలో కరోనా వైరస్ మ‌హోగ్ర రూప‌మై దాడి కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. సాధార‌ణ మ‌నుషులక‌న్నా మ‌ద్యం తీసుకుంటున్న వారిపై మాత్రం ఎక్కువ‌గా దాడిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అకాడ‌మీ ఫ‌ర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్‌), భార‌త ప‌రిశ్ర‌మల స‌మాఖ్య (సీఐఐ) ఆధ్వ‌ర్యంలో శ‌నివారం నిర్వ‌హించిన వెబినార్ లో నిపుణులు కీల‌క విశ్లేష‌ణ‌లు చేశారు.

మొద‌టి ద‌శ‌లో వృద్ధులు, ఇత‌ర దీర్ఘ‌కాలిక రోగుల‌పై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపగా.. రెండో ద‌శ‌లో యువ‌త‌, గ‌ర్భిణులు దీని బారిన ప‌డుతున్నార‌ని చెప్పారు. శిశువులు, చిన్నారుల్లో మాత్రం పెద్ద‌గా ఎఫెక్ట్ చూపించ‌ట్లేద‌ని చెబుతున్నారు. అయితే.. మ‌ద్యం అధికంగా తీసుకునే వారిపై, ధూమ‌పానం ఎక్కువ‌గా చేసే వారిపై తీవ్ర‌ప్ర‌భావం చూపిస్తోంద‌ని చెప్పారు. వారిలో కోలుకునే రేటు త‌క్కువ‌గా ఉంద‌ని తెలిపారు. దీనికి రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు.

అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించారు. 18 సంవ‌త్స‌రాలు దాటినవారంతా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని చెప్పారు. రెండు డోసులు త‌ప్ప‌కుండా వేయించుకోవాల‌ని చెప్పారు. రెండో డోసు 4 నుంచి 8 వారాల్లో తీసుకోవాల‌ని సూచించారు. ఇక, ఫ‌లితాలు మాత్రం రెండో డోసు తీసుకున్న 15 రోజుల ర‌త్వాత క‌నిపిస్తాయ‌న్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా 30 శాతం కొవిడ్ వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని చెప్పారు. అందువ‌ల్ల అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పారు.