Begin typing your search above and press return to search.
అందరినోట మళ్లీ శ్రమజీవి పార్టీ మాట!
By: Tupaki Desk | 16 Feb 2016 9:21 AM GMTఆ మధ్యన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ ఎస్ పార్టీకి అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించిన సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది శ్రమజీవి పార్టీ. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు తక్కువే అయినప్పటికీ.. ఏపీ విపక్షం..వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించిన ఓట్ల కంటే చాలా ఎక్కువగా రావటం అందరి దృష్టిని ఆకర్షించింది. జగన్ పార్టీ కంటే ఎవరికి పెద్దగా తెలియని శ్రమ జీవి పార్టీకి అన్ని ఓట్లా? అని ఆశ్చర్యపోయిన వారు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి శ్రమజీవి పార్టీ పేరు తెర మీదకు వచ్చింది. మెదక్ జిల్లాలో జరిగిన నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 14,787. కిందామీదా పడి.. టీటీడీపీ అధినాయకత్వం ప్రచారం చేస్తే ఆ మాత్రం ఓట్లు రాగా.. అందుకు భిన్నంగా శ్రమజీవి పార్టీ అభ్యర్థికి 5,377 ఓట్లు రావటం గమనార్హం. మొత్తం 1.54 లక్షల ఓట్లు పోలైతే.. 10 శాతం ఓట్లు కూడా టీటీడీపీకి రాకపోవటం విశేషం. ఇక.. నోటాకు కూడా పెద్దగా ఓట్లు పడింది లేదు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేసే వీలుంది. నోటాను ఉపయోగించిన వారు సుమారు 850 మంది మాత్రమే ఉండటం గమనార్హం.