Begin typing your search above and press return to search.
తొలి టెస్టు శతక వీరులు 16 మంది.. వారిలో నిలిచిందెదరు?
By: Tupaki Desk | 26 Nov 2021 10:30 AM GMTన్యూజిలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత శతకం సాధించాడు. దీంతోపాటు అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసిన 16వ భారత బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ముంబైకి చెందిన అయ్యర్.. 2014లో కాన్పూర్ లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారానే వెలుగులోకి వచ్చాడు.
నాడు 19 ఏళ్ల కుర్రాడిగా ప్రతిభ చాటిన అయ్యర్.. మళ్లీ 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా మూడంకెల స్కోరు అందుకుని రికార్డులకెక్కాడు. 75 పరుగులతో రెండో రోజు శుక్రవారం ఆటను ప్రారంభించిన అయ్యర్.. న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి సెంచరీని అందుకున్నాడు. 157 బంతుల్లో మూడంకెల మార్క్ చేరుకున్నాడు.
ఇందులో 12 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో అరంగేట్రంలో సెంచరీ చేసిన 3వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. తన అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. రెండో సెషన్‌లో కివీస్ బౌలర్లు ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ సరైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యం అదించాడు.
ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్
26 ఏళ్ల శ్రేయస్ బ్యాటింగ్ శైలి కొంచెం భిన్నంగా ఉంటుంది. బ్యాట్ హ్యాండిల్ ను మొదటి నుంచి (బాటమ్ హ్యాండ్) పట్టుకుంటాడు. దీంతో చూసేవారికి కొంత విభిన్నంగా కనిపిస్తుంది. అయితే, క్లాస్, మాస్ రెండిండినీ కలిపి కొట్టడంలో ఇతడు దిట్ట. ఎంత సొగసుగా ఆడగలడో.. అంత విధ్వంసమూ చేయగలడు. 2018 ఐపీఎల్ లో అతడు ఆడిన ఇన్నింగ్స్ లే ఇందుకు ఉదాహరణ. టీమిండియా తరఫున టి20ల్లోనూ శ్రేయస్ ప్రతిభ చూపాడు. భారీ షాట్లను కూడా అలవోకగా బాదగల ప్రతిభ శ్రేయస్ సొంతం.
16 మందిలో నిలదొక్కకుంది కొందరే..
టీమిండియా తరఫున తొలి టెస్టు ఆడుతూ సెంచరీ చేసినవారు 16 మందికాగా.. అందులో కెరీర్ దిగ్విజయంగా కొనసాగించింది కొందరే. 1933 లో తొటి టెస్టు ఆడుతూనే సెంచరీ చేశాడు లాలా అమర్ నాథ్. తన కెరీర్ కొంత ఫర్వాలేదు. తర్వాత షోదన్, క్రిపాల్ సింగ్, అబ్బాస్ అలీ బేగ్, హనుమంత సింగ్ , సురీందర్ అమర్ నాథ్ మాత్రం విజయవంతం కాలేకపోయారు. అయితే, గుండప్ప విశ్వనాథ్ అద్భుత బ్యాటర్ గా పేరుగాంచాడు.
అనంతరం తొలి టెస్టు సెంచరీ వీరుల జాబితాలో చేరింది మన హైదరాబాదీ మహమ్మద్ అజహరుద్దీన్. అజర్ ఏకంగా తొలి మూడు టెస్టుల్లోనూ శతకం బాదాడు. ఇప్పటికీ ఇది చెదరని రికార్దే. ప్రవీణ్ అమ్రే ఏకంగా దక్షిణాఫ్రికా గడ్డ మీదే తొలి సెంచరీ బాదాడు. అయితే, అప్పట్లో అతడు గొప్ప బ్యాట్స్ మన్ అవుతాడని భావించారు. కానీ, వైఫల్యాలతో ముందుకెళ్లలేకపోయాడు.
గంగూలీ వెలుగులోకి
1996 ఇంగ్లండ్ టూర్ లో సౌరభ్ గంగూలీ సైతం తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టాడు. రెండో మ్యాచ్ లోనూ వంద సాధించాడు. అజహర్ ఫీట్ ను అందుకుంటాడని అనుకున్నా కొద్దిలో మిస్సయ్యాడు. కాగా ఆటగాడిగా, సారథిగా అతడు అత్యంత విజయవంతం అయ్యాడు. ఆపై తొలి టెస్టు లోనే సెంచరీ చేసింది వీరేంద్ర సెహ్వాగ్.
వీరూ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచూరియన్ అతడు. రెండు ట్రిపుల్ సెంచరీలు చేసినది కూడా వీరూ ఒక్కడే. మొదటి టెస్టులోనే సెంచరీ చేసిన సురేశ్ రైనా టెస్టు కెరీర్ ఏమంత గొప్పగా సాగలేదు.
శిఖర్ ధావన్ కెరీర్ కూడా దాదాపు ఇంతే. కాగా, రోహిత్ శర్మ సైతం తొలి రెండు టెస్టుల్లో శతకాలు చేసినా.. తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. పునర్జన్మ లభించడంతో ఇప్పుడు చెలరేగుతున్నాడు. ఇక సరిగ్గా మూడేళ్ల క్రితం అరంగేట్ర టెస్టులో సెంచరీ కొట్టిన ప్రథ్వీ షా గాయాలు, ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యాడు.
అతడింకా యువకుడే కాబట్టి మున్ముందు ఎలా పుంజుకుంటాడో చూడాలి. మొత్తానికి ఇదీ తొలి టెస్టులోనే సెంచరీ కొట్టిన భారత బ్యాట్ప్ మెన్ కెరీర్ ప్రస్థానం. మరి శ్రేయస్ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.