Begin typing your search above and press return to search.
శ్రేయస్ ఇప్పట్లో కోలుకోలేడు.. మరి ఢిల్లీ కెప్టెన్ ఎవరు?
By: Tupaki Desk | 30 March 2021 5:30 AM GMTటీమిండియా బ్యాట్స్ మెన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే శ్రేయస్‌కు చాలా పెద్ద గాయమైందని డాక్టర్లు అంటున్నారు. అతడు ఇప్పట్లో కోలుకోలేడని.. దాదాపు ఆరునెలలపాటు రెస్ట్ లో ఉండక తప్పదని వైద్యులు చెబుతున్నారు. శ్రేయస్ ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ కు గాయం కావడం ఢిల్లీకి పెద్ద దెబ్బే అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డే లో శ్రేయస్ అయ్యర్ కు ఎడమ భుజానికి గాయమైంది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో జానీ బెయిర్‌స్టో ఓ భారీ షాట్‌ను కొట్టాడు. ఆ బంతిని ఆపే క్రమంలో శ్రేయస్ కిందపడి గాయపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియోలు మైదానానికి వచ్చి గాయాన్ని పరీక్షించగా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి సూచనల మేరకు అయ్యర్ మైదానం వీడాడు.
ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయగా అతడి ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్టు తేలింది. స్కానింగ్ చేయగా అయ్యర్ ఎడమ భుజం డిస్ లోకేట్ అయ్యిందని తెలిసింది.ఏప్రిల్ 8న శ్రేయస్ అయ్యర్ కు సర్జరీ జరగనున్నది. ఆ తర్వాత అతడు ఐదునెలల పాటు రెస్ట్ లో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇక శ్రేయస్ ఐపీఎల్ 2021లో ఆడే అవకాశాలు లేవు.ఒకవేళ అతడు కోలుకుంటే సెప్టెంబర్ లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, టీ20 సిరీస్ లకు మళ్లీ జట్టులోకి చేరే అవకాశం ఉంది.
అయితే శ్రేయస్ స్థానంలో ఎవరిని కెప్టెన్ గా నియమించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆలోచిస్తున్నది. కెప్టెన్సీ కోసం ఐదుగురు పోటీలో ఉన్నట్టు టాక్. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, అజింక్య రహానే, స్టీవ్ స్మిత్, పృథ్వీ షా పోటీలో ఉన్నారు. అయితే వీళ్లతో పాటు శిఖర్ ధావన్ కు కూడా చాన్స్ ఉంది. కానీ శిఖర్ ధావన్ ను కెప్టెన్ గా పెడితే బ్యాటింగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేడేమోనని యాజమాన్యం అనుమానిస్తున్నదట. అంతేకాక అతడికి అనుభవం కూడా లేదు. స్టీవ్ స్మిత్ ను ఇటీవల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నది. స్మిత్ గతంలో ఐపీఎల్ కెప్టెన్ గా చేశాడు.. దీంతో అతడికే ఎక్కువ అవకాశం ఉన్నట్టు సమాచారం.