Begin typing your search above and press return to search.

అంబానీ చేతికి 'శుభలక్ష్మీ పాలి'.. డీల్ విలువ ఎంతంటే?

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:13 AM GMT
అంబానీ చేతికి శుభలక్ష్మీ పాలి.. డీల్ విలువ ఎంతంటే?
X
క్లిష్టమైన కరోనా వేళ.. కంపెనీలన్నీ హాహాకారాలు చేస్తున్న వేళ.. తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నభయాందోళనల్లో మునిగిపోయిన వేళ.. తన సంస్థలోని వాటాల్ని ప్రీమియం రేటుకు అమ్మి వార్తల్లో నిలిచిన రిలయన్స్ ఇటీవల కాలంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున కంపెనీలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసి.. భయాందోళనల్ని కలిగించిన వేళ.. వ్యాపారం చేయటమే గగనంగా మారిన సందర్భంలో.. మిగిలిన వ్యాపార దిగ్గజాలకు భిన్నంగా.. ముకేశ్ అంబానీ.. తన సంస్థలోని వాటాల్ని తెలివిగా విక్రయించిన వైనం తెలిసిందే.

అప్పట్లో వాటాల్ని క్రమపద్దతిలో అమ్మేసిన ఆయన.. అదంతా సేల్ టైంగా ఆయన వ్యవహరించారు. గడిచిన కొంతకాలంగా వ్యూహాత్మకంగా తమ కంపెనీని మరింత వేగంగా పరుగులు తీయించేందుకు వీలుగా ఒక్కో కంపెనీని సొంతం చేసుకుంటూ.. ఇప్పుడంతా కొనే టైం అన్న సందేశాన్ని ఇస్తున్న పరిస్థితి. తాజాగా మరో సంస్థను సొంతం చేసుకున్నారు ముకేశ్ అంబానీ.

శుభలక్ష్మీ పాలియెస్టర్స్ సంస్థను తాజాగా కొనుగోలు చేశారు. పాలియెస్టర్ చిప్స్.. యార్న్ తయారీ కంపెనీగా సుపరిచితమైన ఈ సంస్థను రూ.1522 కోట్లతో డీల్ ఫైనల్ చేశారు. డీల్ లో భాగంగా శుభలక్ష్మీ పాలియెస్టర్స్.. శుభలక్ష్మీ పాలిటెక్స్ లిమిటెడ్ కు చెందిన పాలియెస్టర్ బిజినెస్ లను కొన్నట్లుగా పేర్కొన్నారు. ఈ డీల్ కు కాంపిటీషన్ కమిషన్ తో పాటు రెండు సంస్థల రుణదాతల నుంచి అనుమతులు లభించాల్సి ఉన్నట్లుగా పేర్కొన్నారు.

శుభలక్ష్మీని సొంతం చేసుకోవటానికి ఒప్పందం చేసుకున్న అంబానీ నిర్ణయంతో రిలయన్స్ టెక్స్ టైల్ తయారీ బిజినెస్ మరింత పటిష్ఠం కానున్నట్లుగా చెబుతున్నారు. ఏడాదికి 2.52 లక్షల టన్నుల పాలిమరైజేషన్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న శుభలక్ష్మీ ఫైబర్.

యార్స్.. టెక్స్ టైల్ గ్రేడ్ చిప్స్ తయారు చేస్తుంది. గుజరాత్ లోని దహేజ్.. దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో ఈ సంస్థ ప్లాంట్లను నిర్వహిస్తోంది. మొత్తానికి తాజా డీల్ నేపథ్యంలో రిలయన్స్ షేరు మరింత బలపడనుందన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.