Begin typing your search above and press return to search.
హోటల్స్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు
By: Tupaki Desk | 11 Feb 2017 1:36 PM GMTహోటళ్లకు.. రెస్టారెంట్ యజమానులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాన్ని జారీ చేసింది. రోడ్డు పక్కన ఉండే రెస్టారెంట్లు.. హోటళ్లు చాలావరకు సరైన పార్కింగ్ వసతి ఉండదు. అదే సమయంలో.. వాహనాలు నిలిపితే తమకు సంబంధం లేవని చెబుతాయి. మరి.. హోటల్ కు వచ్చేవారు తమ వాహనాల్ని ఎక్కడ పెట్టాలని అడిగితే.. సరిగా సమాధానం ఇవ్వని పరిస్థితి ఉంది.
దీంతో.. హోటల్స్ కు.. రెస్టారెంట్లకు వెళ్లే వారంతా వాహనాల్ని ఎక్కడ నిలపాలో తెలీక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చాలామంది రోడ్లమీదనే వాహనాల్ని నిలిపేస్తుంటారు. దీంతో.. ట్రాఫిక్ ఇబ్బందులు తరచూ ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా తాజాగా మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాన్ని ఇచ్చింది. దీని ప్రకారం.. సరిపడా పార్కింగ్ ప్లేస్ లేని రెస్టారెంట్లు.. హోటళ్లు మూసివేయాల్సిందిగా పేర్కంది.
పార్కింగ్ లేని హోటళ్లకు.. రెస్టారెంట్లకు లైసెన్స్ లు రద్దు చేయాలంటూ దాఖలైన పిల్ ను విచారించిన హైకోర్టు బెంచ్ సభ్యులు.. హోటళ్లను మూసివేయాలన్న హైకోర్టు.. తదుపరి కేసు విచారణను మర్చి 24కు వాయిదా వేసింది. తమ ఆదేశాల నేపథ్యంలో సరైన పార్కింగ్ స్థలం లేకుండా రెస్టారెంట్లు.. హోటళ్లు నడుస్తుంటే వాటిని మూసివేయాల్సిందిగా బెంచ్ స్పష్టం చేసింది. మరి.. దీనిపై హోటళ్ల యాజమాన్యాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.