Begin typing your search above and press return to search.

క్రేజీ నిర్ణ‌యంపై కేసులు షురూ...

By:  Tupaki Desk   |   8 Dec 2015 10:19 AM GMT
క్రేజీ నిర్ణ‌యంపై కేసులు షురూ...
X
ఢిల్లీలో సరి సంఖ్య వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య వాహనాలు మరొకరోజు తిరిగేలా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ర‌గ‌డ ఇంకా చ‌ల్లార‌లేదు. భార‌త‌దేశంలోని ప‌రిస్థితులకు ఏ మాత్రం స‌రిపోని విధంగా ఉన్న ఢిల్లీ స‌ర్కారు నిర్ణ‌యంతో అక్క‌డి సామాన్యులు ఖంగుతిన్న సంగ‌తి తెలిసిందే. కేజ్రీవాల్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ...సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా చ‌ర్చ సాగుతున్న క్ర‌మంలోనే తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

ఎలాంటి చర్చ లేకుండా, ప్రజాభిమతానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ శ్వేతా కపూర్‌ అనే న్యాయవాది తరఫున ఆర్‌.కె.కపూర్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. దేశ రాజధానిలో ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందని, సురక్షితం కాని వ్యవస్థ అని ఆ పిల్‌ లో పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వానికి దేశ రాజధానిల వాహనాల రాకపోకల్లో మార్పు చేసే అధికారం ఉందా అని ఆ పిల్‌ లో ప్రశ్నించారు. నూతన విధానం వల్ల స్వంత వాహనాలపై వెళ్లే మహిళలు, ప్రత్యేక వాహనాల్లో వెళ్లే వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బదార్‌ దుర్రేజ్‌ అహ్మద్‌ - జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌ దేవలతో కూడిన ధర్మాసనం ఈ పిల్‌ ను స్వీక‌రించింది. ఈ నెల 9వ తేదీన ఈ పిల్‌ పై ధ‌ర్మాస‌నం విచారణ చేపట్టనుంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ద్విచ‌క్ర వాహ‌నం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయింది. ఈ క్ర‌మంలో వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణం సాకుగా చూపుతూ అస్స‌లే పొంతన లేని విధానాన్ని దేశ రాజ‌ధానిలో ప్ర‌వేశ‌పెట్ట‌డంపై పెద్ద ఎత్తు వ్య‌తిరేక‌త ఎదురైంది. అయిన‌ప్ప‌టికీ కేజ్రివాల్ స‌ర్కారు త‌న నిర్ణ‌యాన్ని పునః స‌మీక్షించుకోక‌పోవ‌డంతో ఇపుడు రాష్ర్ట ప్ర‌భుత్వం ఇపుడు కోర్టుల‌కు స‌మాధానం ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.