Begin typing your search above and press return to search.
హనుమంతప్ప కన్నుమూత
By: Tupaki Desk | 11 Feb 2016 10:17 AM GMTఆరు రోజుల పాటు కొండ చరియల మధ్య ఇరుక్కుని ప్రాణాలు నిలుపుకోగలిగిన వీర సైనికుడు హనుమంతప్ప.. చివరికి మృత్యుపోరాటంలో ఓడిపోయాడు. హనుమంతప్ప ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలిం లేకపోయింది. ఢిల్లీలోని ఆర్ ఆర్ హాస్పిటల్లో ఈ రోజు ఉదయం 11.45 ప్రాంతంలో హనుమంతప్ప తుది శ్వాస విడిచాడు.
హనుమంతప్పకు శరీరంలో పలుచోట్ల తీవ్ర గాయాలవడం.. కొన్ని అవయవాలు పని చేయకుండా పోవడంతో వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వెంటిలేటర్ మీదే ఉన్నాడు హనుమంతప్ప. ప్రముఖ వైద్యుల బృందం ఈ వీర సైనికుడిని కాపాడటానికి ఎంతగా ప్రయత్నించినా అతడి పరిస్థితి మెరుగవలేదు. కొందరు హనుమంతప్పకు కిడ్నీ దానం చేయడానికి కూడా ముందుకొచ్చారు.
19 మద్రాస్ రెజిమెంట్ లో సైనికుడైన హనుమంతప్ప ఫిబ్రవరి 3న కొండచరియలు విరిగిపడటంతో 35 అడుగుల లోతుల్లో ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో సహచర సైనికులు ప్రాణాలు కోల్పోయినా.. హనుమంతప్ప మాత్రం ఆరు రోజులు ప్రాణం నిలుపుకోగలిగాడు. తీవ్ర విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడిన హనుమంతప్ప.. ఆసుపత్రికి వచ్చాక ప్రాణం కోల్పోవడం విషాదం.