Begin typing your search above and press return to search.
యెడ్డికి షాక్..సిద్ధూకి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రకాష్ రాజ్
By: Tupaki Desk | 26 April 2018 6:54 AM GMTవిలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్యన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ... ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు బీజేపీకి షాకింగ్ గా మారగా.. కాంగ్రెస్ కు సర్ ప్రైజింగ్ గా మారాయి. తన ఆప్త మిత్రురాలు.. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణహత్య తర్వాత నుంచి ఆయన రాజకీయాల గురించి తన మనసులోని మాటల్ని చెప్పటం మొదలు పెట్టారు.
ఆమె మరణం తర్వాత ప్రకాశ్ రాజ్ లో చాలానే మార్పులు వచ్చాయి. రాజకీయాలతో పాటు సామాజిక అంశాల విషయంలోనూ ఆయన తరచూ స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. హోరాహోరీగా సాగుతున్న కన్నడ నాట అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన యడ్యూరప్పతో పోలిస్తే.. కాంగ్రెస్ కు చెందిన సిద్దరామయ్య సీఎంగా ఎంతో బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటివరకూ పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇంత ఓపెన్ గా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేసింది లేదు. సిద్దరామయ్యకు అనుకూలంగా మాట్లాడిన ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఒకవేళ బీజేపీ గెలిచి యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి అయినా ఆయన మూడు నెలలకు మించి ఆ పదవిలో ఉండలేరని వ్యాఖ్యానించారు. మతానికి తాను వ్యతిరేకం కాదని.. మతం వెలుగును ఇవ్వాలే తప్పించి అంధకారంలోకి నెట్టేయకూడదన్నారు.
ఈ మధ్యన తరచూ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్నారేమిటంటటూ ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఏం.. సినిమా నటులు రాజకీయాల గురించి మాట్లాడకూడదా? అంటూ ప్రశ్నించటం ద్వారా సమాధానాన్ని చెప్పేశారు.