Begin typing your search above and press return to search.
ఆ సీఎం షాపింగ్ చేసిన చీర రేటు ఎంతంటే?
By: Tupaki Desk | 20 Jan 2016 7:00 AM GMTఈ మద్య అనవసర విషయాలకు సంబంధించి మీడియాలో కనిపిస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. రెండు.. మూడు రోజుల క్రితం ఒక ప్రభుత్వాధికారి చెంప ఛెళ్లుమనిపించిన ఆయన తీరు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీడియా కెమేరాల సాక్షిగా చెంప పగలగొట్టిన ఆయన.. తాను చేయి చేసుకోలేదని.. జస్ట్ పక్కకు నెట్టానని కవర్ చేసుకున్నారు. ఈ వివాదం సమిసిపోకముందే.. ఆయన తాజాగా చేసిన షాపింగ్ ఆసక్తికరంగా మారింది.
దావణగెరెలో కొత్తగా నిర్మించిన షాపింగ్ మాల్ లో మైసూర్ చీరల వస్త్ర దుకాణాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షాపింగ్ చేశారు. ముఖ్యమంత్రులు షాపింగ్ చేయటమే అరుదు అనుకుంటే.. సిద్దరామయ్య షాపింగ్ కాస్తంత షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే.. ఆయన కొనుగోలు చేసిన చీర ఖరీదు కూ.1.38లక్షలుగా ఉండటం గమనార్హం.
చీరల దుకాణాన్ని ప్రారంభించిన సందర్భంగా చీరల్ని చూస్తున్న ఆయన.. ఒక చీర అద్భుతంగా ఉండటం గమనించి వెంటనే దాన్ని కొనుగోలు చేశారు. దాని ధర భారీగా ఉండటం అందరి నోట సిద్దరామయ్య షాపింగ్ ముచ్చట ప్రముఖంగా వినిపిస్తోంది.