Begin typing your search above and press return to search.
వాళ్లు వ్యభిచారులు.. నోరుజారిన మాజీ సీఎం
By: Tupaki Desk | 31 Aug 2019 8:54 AM GMTకర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి నోరుజారాడు. కన్నడ నాట సంకీర్ణ జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంలో సిద్ధరామయ్యే కీలక పాత్ర పోషించాడని జేడీఎస్ అధినేత దేవెగౌడ స్వయంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. మాజీ సీఎం కుమారస్వామి కూడా తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తెరవెనుక సిద్ధరామయ్యే కారణమని ఆరోపించాడు. తనను సీఎంగా ఉంచడానికి సూతరం ఇష్టపడలేదని మండిపడ్డారు.
అయితే ఈ ఆరోపణలను అందిపుచ్చుకున్న జేడీఎస్ కార్యకర్తలు ఇటీవల సిద్ధరామయ్యపై విపరీతమైన విమర్శలు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఓవిలేకరి ఇదే విషయంపై సిద్ధరామయ్యను ప్రశ్నించగా ఆయన నోరుజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి దుమారం రేపుతున్నాయి.
జేడీఎస్ కార్యకర్తలంతా వ్యభిచారులని సిద్ధరామయ్య మండిపడ్డారు. దానికో సామెత కూడా జోడించి ఎండగట్టారు. నాట్యం రాని వ్యభిచారి వేదిక మీద నృత్యం చేయడానికి అనుకూలంగా లేదని సాకులు చెబుతుందని.. అలానే జేడీఎస్ కార్యకర్తలు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ సిద్ధరామయ్య మండిపడ్డారు.
జేడీఎస్ కార్యకర్తలను వ్యభిచారులతో పోల్చడం దుమారం రేపింది. దీనిపై జేడీఎస్ నేతలంతా సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు, జేడీఎస్ నేతలకు మధ్య ఉప్పునిప్పులా పరిస్థితి కన్నడనాట తయారైంది.