Begin typing your search above and press return to search.
కర్ణాటక సీఎంకు మూడిందా?
By: Tupaki Desk | 15 April 2016 4:23 AM GMTకాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దేశంలో ఇప్పుడు చాలా తక్కువే ఉన్నాయి. అధికారం ఉన్న చోట ఆచితూచి వ్యవహరించాల్సింది పోయి.. తమదైన కుంభకోణాలతో ముందుకెళుతున్న ప్రభుత్వాల తీరు కష్టాల్ని కొని తెచ్చుకున్నట్లుగా ఉంది. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీరు ఇదే రీతిలో ఉంది. కొడుకు మీద ప్రేమతో కన్నడ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆయన సీటుకు ఎసరు తెచ్చేలా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. తాము అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా.. ఒక్కటంటే ఒక్క కుంభకోణం కూడా వెలుగు చూసింది లేదంటూ మోడీ సర్కారు చెలరేగిపోతుంటే.. ఆ మాటలకు కౌంటర్ ఇవ్వలేని నిస్సహాయస్థితిలో కాంగ్రెస్ ఉంది.
ఇదిలా ఉంటే.. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా కుంభకోనాలు లాంటివి చోటు చేసుకోకుండా అధినాయకత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అలాంటి వైఖరి కనిపించట్లేదు. కొడుకు మీదున్న ప్రేమతో కర్ణాటక సీఎం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్ధరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్రకు చెందిన ఒక కంపెనీకి రూ.150 కోట్లు విలువ చేసే బీడీఏ భూమిని ధారాదత్తం చేశారన్న ఆరోపణ సహచట్టం కార్యకర్త కారణంగా బయటకు వచ్చింది.
ఈ ఆరోపణ రావటమే కాదు.. అందుకు సంబంధించిన ఆధారాల్ని బయటపెట్టటంతో సిద్ధరామయ్య నోట మాట రాని పరిస్థితి. సీఎం కుమారుడు యతీంద్ర.. తన స్నేహితుడైన రాజేష్ గౌడ్ అనే వ్యక్తికి చెందిన శాంత ఇండస్ట్రీస్ లో భాగస్వామిగా మారారు. ఆయన పార్టనర్ గా చేరిన తర్వాత ఆ కంపెనీకి రూ.150కోట్లు విలువ చేసే భూమిని ధారాదత్తం చేసిన ఉదంతం బయటకు వచ్చింది.
శాంత ఇండస్ట్రీస్ కు చెందిన భూమిని బీడీఏ స్వాధీనం చేసుకుంది. బెంగళూరు మహానగరంలోని మహాలక్ష్మీ లేఔట్లో ఉన్న ఈ భూమిని తమకే ఇవ్వాలంటూ శాంత ఇండస్ట్రీస్ ఎంతోకాలంగా వాదిస్తోంది. అయితే.. ఈ ఫైల్ ఎంతకూ ముందుకు కదలని పరిస్థితి. ఇదిలా ఉంటే సీఎం కుమారుడు ఎప్పుడైతే సీన్లోకి ఎంటరయ్యారో.. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా మూలన పడి ఉన్న ఫైలు చకచకా కదలటమే కాదు.. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి ఇచ్చేసిన వైనం తాజాగా సమాచార చట్టం కార్యకర్త బయటకు తీయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇదొక్కటే కాదు.. సిద్ధరామయ్య కుమారుడు భాగస్వామిగా ఉన్న మ్యాట్రిక్ సంస్థ రూల్స్ కి భిన్నంగా సర్కారీ దవాఖానాల్లో డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతి పొందారని చెబుతున్నారు. ఏది ఏమైనా.. కోరి కష్టాల్ని కొనితెచ్చుకున్నట్లగా కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యవహరించారన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. ఈ వివాదం సిద్ధరామయ్య సీటుకు ఎసరు పెడుతుందా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.