Begin typing your search above and press return to search.
అలా చేస్తే..రక్తపాతాలే అంటున్న సీఎం
By: Tupaki Desk | 7 May 2018 12:15 PM GMTకేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే లౌకికవాదంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కర్ణాటకలోని ఒక కుల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్వభావాన్ని ప్రశ్నించేవిధంగా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. అయితే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్యా బీజేపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయతీ నేతగా కూడా పనికిరాని అనంత్ కుమార్ హెగ్డెలాంటి అసమర్థుడిని కేంద్ర మంత్రిని చేశారంటూ బీజేపీని విమర్శించారు. ఇలాంటివి బీజేపీలోనే సాద్యమని ఆయన పేర్కొన్నారు.
గత ఏడాది ఓ సభలో కేంద్రమంత్రి హెగ్డే చేసిన కామెంట్లను సిద్ధరామయ్య గుర్తు చేస్తూ...రాజ్యాంగాన్ని మారుస్తామన్న హెగ్డె వ్యాఖ్యల ప్రకారం .. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పని చేస్తే దేశంలో రక్తపాతమే ఉంటుందని సిద్దరామయ్య హెచ్చరించారు. సామాజిక న్యాయం అంటే బీజేపీకి అస్సలు తెలియదని ఆయన విమర్శించారు. ఇదిలాఉండగా...హెగ్డే వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు కొత్త విశ్లేషణలు చేస్తున్నాయి. బీజేపీ దేశంలో ఒక్కో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకొంటూ పోతుండటం కాంగ్రెస్ ఉనికి నాలుగు రాష్ట్రాలకే పరిమితం కావడంతో బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదా అన్న అనుమానం కలుగకపోదు. మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం సాధిస్తుండటంతో బీజేపీ తన అజెండాను నెమ్మదిగా అమలు చేసేందుకు అడుగులు కదుపుతున్నట్టు అర్థమవుతున్నది. ట్రిపుల్ తలాఖ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, అయోధ్య కేసును పరిష్కారం దిశగా కదిలించడం వంటి చర్యలు ఒక్కటొక్కటిగా తన సైద్ధాంతిక మార్గాన్ని అనుసరిస్తున్న తీరును తెలియజేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మినహా, ఆ పార్టీలోని అతివాద నేతలు తరచూ రకరకాలైన ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ ఈ అతివాదం పెరిగిపోతున్నది. ఇప్పుడు అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి కారణమయ్యాయి.