Begin typing your search above and press return to search.
జల్లికట్టు లాగే దున్నల పోటీలపై కోర్టు వార్
By: Tupaki Desk | 24 Jan 2017 5:42 AM GMTతమిళుల సంప్రదాయ పోటీ జల్లికట్టుపై నెలకొన్న ఉత్కంఠ అనంతరం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే ఇపుడు అదే రీతిలో మరో పోటీ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో తెరమీదకు వచ్చింది. కర్నాటకలో ‘కంబాలా’ పేరుతో దున్నల పోటీలను ప్రతిఏటా నిర్వహిస్తుంటారు. అయితే కంబాలా క్రీడ కోర్టు వివాదంలో ఉంది. సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించిన నేపథ్యంలో 2016 నవంబర్ లో పెటా కార్యకర్తలు కర్నాటక కోర్టును ఆశ్రయించి కంబాలా పోటీలపై తాత్కాలిక స్టేను తీసుకొచ్చారు. కేసు డివిజన్ బెంచ్ విచారించి ఈ నెల 30కి వాయిదా వేసింది. అయితే కర్నాటక సంస్కృతి - సంప్రదాయాలకు చిహ్నమైన కంబాలా క్రీడను నిలిపివేయడం దారుణమని పలు సంఘాలు వాదిస్తున్నాయి. అంతేకాదు ఏకంగా పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమిళనాడు తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కంబాలా కమిటీలు హెచ్చరించాయి.
కర్నాటక కోస్తా అంతటా దున్నల పోటీలు భారీఎత్తున నిర్వహిస్తుంటారని కంబాలా కమిటీలు స్పష్టం చేశాయి. మంగళూరులో జరిగిన కంబాలా కమిటీలు దీనిపై ఉద్యమం చేస్తామని తెలిపాయి. ఈ నెల 28న దక్షిణ కన్నడ జిల్లా మొదుబరిలో భారీర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ దున్నల పరుగుపందాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జల్లికట్టు మాదిరిగానే కంబాలా పోటీలకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ‘దున్నల పోటీలకు అనుమతి కోరుతూ పలు సంఘాలు ఉద్యమించనున్నట్టు తెలిసింది. మేమూ ఆ క్రీడకు అనుకూలమే’ అని సిద్దరామయ్య తెలిపారు. కంబాలా ఓ జానపద క్రీడ అని వేల సంవత్సరాలుగా కన్నడిగులు దీన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప తెలిపారు. కంబాలా క్రీడకోసం ఉద్యమాలు చేపట్టే అవసరం లేకుండా కోర్టులో సానుకూల తీర్పు వస్తుందన్న ఆశాభావం ఆయన నేత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా కర్నాటక ప్రజల మనోభావాలను గురించి అనుమతి ఇస్తుందని ఆయన చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/