Begin typing your search above and press return to search.
కొడుకు మాట వినకనే ఆ మాజీ సీఎం దెబ్బ తిన్నారట!
By: Tupaki Desk | 30 Jun 2019 4:54 AM GMTఎక్కడైనా కొడుక్కి తండ్రి సలహాలు ఇస్తుంటారు. ఒకవేళ ఉన్నతస్థానంలో ఉన్న తండ్రికి కొడుకు సలహా ఇస్తే దాని గురించి అంతో ఇంతో ఆలోచిస్తారు. తాను మాత్రం ఆ పని చేయకుండా తప్పు చేసినట్లుగా వాపోతున్నారు ఆ మాజీ ముఖ్యమంత్రి. తాను చేసిన తప్పును కొడుకు సరిదిద్దే ప్రయత్నం చేశారని.. అయినప్పటికీ తాను వినకుండా తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతున్నారు.
ఇంతకీ ఈ మాటలన్ని చెప్పిందెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. తాను సీఎంగా వ్యవహరించిన వేళలో లింగాయతులకు ప్రత్యేక మతం అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొద్దని.. అది మీ పొలిటికల్ కెరీర్ పై పెద్ద ప్రమాదం చూపిస్తుందని తన కొడుకు యతీంద్ర ముందే హెచ్చరించినట్లుగా ఇప్పుడు చెబుతున్నారు.
తాను తన కొడుకు మాటలు విననందుకు తగిన గుణపాఠం చవి చూస్తున్నట్లుగా ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట. కొడుకు మాట విని ఉంటే పరిస్థితి మరోలా ఉందని చెబుతున్నట్లు తెలుస్తోంది.
2018అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లింగాయతులకు ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ సిద్దరామయ్య నేతృత్వంలోని కేబినెట్ తీర్మానం చేయటం.. అనంతరం కేంద్రానికి సిఫార్సు చేయటం తెలిసిందే. అయితే.. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని తన కొడుకు చెప్పినా.. అతడి రాజకీయ అనుభవం ఏపాటిదన్న ఉద్దేశంతో తాను పెద్దగా పట్టించుకోలేదని.. అదే ఇప్పుడు పెద్ద తప్పుగా మారినట్లుగా ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.