Begin typing your search above and press return to search.
మైకు లాగబోయి చున్నీ లాగిన మాజీ సీఎం
By: Tupaki Desk | 28 Jan 2019 3:06 PM GMTకర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఏం చేసినా సంచలనమే. ఆయన బిహేవియేరే చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చాలా వివాదాలకు కేరాఫ్ గా ఉన్నసిద్ధూ.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక సభలో మహిళ చేతుల్లోంచి మైక్ లాగబోయి ఆమె చున్నీ లాగేశాడు. ఇది కాస్తా వీడియోలో రికార్డ్ అయ్యింది. వీడియో కాస్తా వైరల్ అయ్యింది.
ముఖ్యమంత్రి కాలేదన్న అసహనం సిద్ధరామయ్యలో ఉంది. అందుకే కుమారస్వామికి ఎప్పటికప్పుడు తలనొప్పులు తెచ్చిపెడుతూనే ఉంటుంటారు. ఇప్పుడు తన కొడుకు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నాటకలోని మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గంలో పబ్లిక్ మీటింగ్ కు హాజరయ్యారు సిద్ధరామయ్య. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ.. యతీంద్ర అసలు ఏం పనులు చేయడం లేదని.. అభివృద్దే జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో.. సిద్ధరామయ్యకు కోపం వచ్చేసింది. మమ్మల్నే అంటావా అంటూ ఆ మహిళ చేతుల్లోంచి మైకు లాక్కోబోయారు. ఈ క్రమంలో మైక్‌తో పాటు ఆమె చున్నీ (దుపట్టా) కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియో .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళ చేతుల్లోంచి మైక్ లాక్కోవడమే కాదు ఆమె చున్నీ లాగేసినందుకు కూడా సిద్ధరామయ్యకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పైగా ఆమెపై చాలా దురుసుగా ప్రవర్తించాడు. కూర్చోవాలి అంటూ గద్దించాడు. ఇక ఈ ఘటనపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళల పట్ల సిద్ధరామయ్య తీరు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని విమర్శించింది. మరోవైపు.. జరిగిన సంఘటనపై విచాణకు ఆదేశించింది జాతీయ మహిళా కమిషన్. వారం రోజుల్లో నివేదిక అందించాల్సిందిగా రాష్ట్ర్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.