Begin typing your search above and press return to search.
ముందే తెలిస్తే అంతా సెట్ చేసుకునేవాళ్లేమో!
By: Tupaki Desk | 4 Aug 2017 4:16 AM GMTకర్ణాటక విద్యుత్తు శాఖ మంత్రి డికె శివకుమార్ మీద రెండు రోజులుగా నిరంతరాయంగా జరుగుతున్న ఆస్తుల సోదా - నగదు స్వాధీనం వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ కుతకుతలాడిపోతోంది. ఈ దాడుల వల్ల పరువు - డబ్బు - రాజకీయ లబ్ధి అన్నీ మంటగలిసిపోవడంతో కాంగ్రెస్ కు చాలా ఆవేదనగా ఉన్నట్లుంది. కాకపోతే.. మంత్రి ఆస్తుల మీద దాడులు చేయడానికి ఐటీశాఖ పదిరోజుల ముందునుంచి సన్నాహాల్లో ఉంటే.. ఆ విషయాన్ని గుర్తించకుండా తమ రాష్ట్ర ఇంటెలిజెన్సు విభాగం ఫెయిలైందని.. కన్నడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుతకుతలాడిపోతున్నారట. ముందే పసిగట్టి చెప్పి ఉంటే.. ఐటీ దాడుల్లో పైసా చిక్కకుండా అంతా సెట్ చేసేసి ఉండేవాళ్లం కదా అని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యవహారం చాలా అవమానంగా కూడా అనిపిస్తోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రమైతే సేఫ్ అనే ఉద్దేశంతో.. గుజరాత్ నుంచి ఎమ్మెల్యేలను అక్కడకు తరలించి క్యాంపు మెయింటైన్ చేస్తోంటే.. అక్కడ ఉన్న మంత్రి మీద ఐటీ దాడులు జరగడం.. తమ ప్రయత్నాలన్నీ అతలాకుతలం అయిపోవడం వారు సహించకలేకపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నులైన రాజకీయ నాయకుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న శివకుమార్.. తన ప్రకటనల్లో ఏమైనా చెబుతుండవచ్చుగానీ.. ఆయన వద్ద దొరికిన డైరీ ఆధారాల ప్రకారం.. ఏఐసీసీకి కర్ణాటక నుంచి ముడుపులు సప్లయి చేసే బాధ్యత కూడా ఆయనదే అని గుర్తించారు. ఐటీ నజర్ పడిన తర్వాత కూడా.. తన సొంత ఇంట్లోని భారీ లాకర్లలో మూడింటిని తెరవడానికి ఆయన నిరాకరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
ఈ మొత్తం పరిణామాంలను కన్నడ సీఎం సిద్ధరామయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీ గద్దె ఎక్కిన తరువాత కర్ణాటకలో కూడా భాజపా నెమ్మదిగా బలం పుంజుకుంటూ ఉంది. ఈసారి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గాలంటే నానా పాట్లు పడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో.. తమ పార్టీకి ఫేవర్ చేయబోయి ఇప్పుడు తాను , తన ప్రభుత్వంలోని మంత్రి అనవసరంగా చిక్కుల్లో పడ్డామే అని ఆయన చింతిస్తూ ఉండవచ్చు. కాకపోతే.. తన ఆగ్రహాన్నంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఇంటెలిజెన్స్ అధికారుల మీద చూపిస్తున్నారు. ఐటీ వారి కదలికల్ని కనిపెట్టలేకపోతే.. ఇంటెలిజెన్స్ ఉన్నదెందుకు అన్నట్లుగా వారి మీద విరుచుకుపడుతున్నారు. ఉరుమురిమి మంగలం మీద పడడం అంటే ఇదే మరి!!