Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ : ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే!
By: Tupaki Desk | 5 Aug 2017 4:56 AM GMTతెలంగాణలో చాలా ప్రముఖమైన సామెత ఇది! తేడాగాడైన దొంగ... పోలీసోడి వెంటపడి తరుముతున్నాడని ఈ సామెత చెబుతుంది. ఇలాంటి వ్యవహారాలు మనకు రాజకీయాల్లో చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. తప్పు చేసిన వారు.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారి మీద అంతకంటె పెద్ద నిందలతో విరుచుకుపడడం, డాంబికంగా మేకపోతు గాంబీర్యంతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తోంది. గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యేలు కట్టు తప్పి పోకుండా, తద్వారా తమ పార్టీ నష్టపోకుండా ఉండడానికి వారిని క్యాంపు రాజకీయాల పేరిట దాదాపుగా నిర్బంధించి, ప్రలోభపెడుతూ దాచేసిన కాంగ్రెస్, ఇప్పుడు భాజపాపై ప్రలోభాల విమర్శలు చేస్తోంది.
బెంగుళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్స్ అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఎందుకంటే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపు పేరిట నిర్బంధించింది ఇక్కడే. వారిని ప్రలోభపెట్టే, సంతృప్తి పరచే, మొత్తానికి వారి ఓట్లు చేజారకుండా జాగ్రత్త తీసుకునే బాధ్యతను కన్నడ మంత్రి డికె శివకుమార్ తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన చేసిన ఓవర్ యాక్షన్ ఐటీ శాఖకు ఉప్పందేలా చేసింది. ఐటీ దాడులు షురూ అయ్యాయి. నీటి ఊట లాగా.. ఆయనకు సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా లాకర్లు వెలికి వస్తూనే ఉన్నాయి. కట్టలు కట్టలుగా దస్తావేజులు - కిలోల కొద్దీ బంగారమూ వెలుగుచూస్తూనే ఉంది. ఇలా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి పూచీ తీసుకుని, తాను కూడా ఎమ్మెల్యేలకు కాపలాగా ఈగల్టన్ రిసార్ట్స్ లోనే రూము తీసుకుని అక్కడే వ్యవహారం నడపాలని చూసిన మంత్రి శివకుమార్.. పాపం.. ఇప్పుడు ఐటీ ఉచ్చులో ఉన్నారు.
ఇలా పరువు బజార్న పడ్డాక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాత్రం ఇంకా భాజపా మీదనే ఆరోపణలు చేస్తున్నారు. తనిఖీల పేరిట ఈగల్టన్ రిసార్టుకు వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు భాజపా తరఫున ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారనేది ఆయన ఆరోపణ. అయినా అధికారులు పార్టీ తరఫున ప్రలోభ పెడుతూ.. ఎమ్మెల్యేలకు డబ్బు ఇవ్వజూపారనే ఆరోపణను ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ఆశించారో అర్థం కాని సంగతి.
అందుకే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడిలాంటి వ్యాఖ్యలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అంటున్నారు. కానీ ఇలాంటి వాస్తవాలను గుర్తించేస్థితిలో కాంగ్రెస్ ఉన్నదా అన్నది అనుమానమే.