Begin typing your search above and press return to search.

అమ్మ అక్రమాస్తుల కేసు విచారిస్తాం

By:  Tupaki Desk   |   29 Dec 2016 8:13 AM GMT
అమ్మ అక్రమాస్తుల కేసు విచారిస్తాం
X
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో ఉహించని పరిణామం ఎదురైంది. ఆమె కేసుల విచారణలో కొనసాగించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో గల సీఎం సిద్దరామయ్య సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ - సుధాకరన్ - ఇళవరసి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో జరిగి తాజా పరిణామాల నేపథ్యంలో సిద్ధరామయ్య నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేస్తూ జయలలిత మృతి చెందిన సమయంలో అందరి దృష్టి అక్రమాస్తుల కేసుపైనే పడింది. కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనే చర్చలు జరిగాయి. కాగా జయలలిత మృతి కారణంగా ఈ వ్యాజ్యాన్ని ముగించరాదని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర న్యాయశాఖ ఉన్నతాధికారులు బెంగళూరులో వెల్లడించారు.

ఇదిలాఉండగా....అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. సర్వసభ్య సమావేశానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరయ్యారు. భేటీ సందర్భంగా దివంగత మాజీ సీఎం జయలలితకు సంతాపం తెలిపిన సభ్యులు సమావేశంలో 14 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నుకొని ఆమె నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో పాటు జయలలితకు మెగాసెసే అవార్డు అదేవిధంగా ప్రపంచ శాంతికి పాటుపడటం విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపిక, జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించడం వంటి పలు తీర్మానాలను ఆమోదించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/