Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ మాజీ సీఎం !

By:  Tupaki Desk   |   16 Dec 2019 12:25 PM GMT
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ మాజీ సీఎం !
X
కాంగ్రెస్ ..దేశ చరిత్రలో 100 ఏళ్ల కి పైగా చరిత్ర గల ఏకైక పార్టీ. అలాగే ఇప్పుడు గొప్ప గొప్ప నేతలుగా తమకి తాముగా పరిచయం చేసుకుంటున్న నేతలందరూ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన వారే. ఇకపోతే గత కొన్ని రోజులు నేషనల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంది అని కూడా అందరూ మర్చిపోయారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.

ఇకపోతే అంతో ఇంతో బాగున్నా కర్ణాటక లో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు దిగజారిపోతోంది. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ భ్ర‌ష్టుప‌ట్టిపోవ‌డానికి ఒక కార‌ణంగా సిద్ధ‌రామ‌య్య అని కొందరు నేతలు చెప్తున్నారు . కాంగ్రెస్ లో సీనియ‌ర్లంద‌రినీ ప‌క్క‌న పెట్టి అధికారం ద‌క్కిన వేళ సిద్దూని సీఎంగా చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా. అటు బీసీ వ‌ర్గాల‌ - ఇటు ముస్లింలకు అనుకూల వ్య‌క్తిగా సిద్దూని సోనియా ఎంచుకున్నారు. ఐదేళ్లు ఆయనే సీఎంగా భాద్యతలు నిర్వర్తించారు.

బీజేపీ వాళ్లు లింగాయ‌త్ ల‌ను - జేడీఎస్ వాళ్లు వ‌క్క‌లిగ‌ను నమ్ముకోగా.. కాంగ్రెస్ వాళ్లు సిద్ధ‌రామ‌య్య ద్వారా క‌ర్ణాట‌క‌లోని జ‌నాభా రీత్యా మూడో పెద్ద కులం కురుబ‌ల‌ను - అలాగే మైనారిటీల‌ను న‌మ్ముకుని రాజ‌కీయం చేశారు. అయితే ఉన్నంతలో ఐదేళ్లలో ఏదో చేసిన సిద్ధ‌రామ‌య్య ఆఖ‌ర్లో లింగాయ‌త్ ల‌తో మ‌త రాజ‌కీయం ఒక‌టి చేశారు. అది మొద‌టికే మోసం అయ్యింది. కాంగ్రెస్ వాళ్లు అధికారం కోల్పోయారు. ఆ త‌ర్వాత జేడీఎస్ తో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. అది కూడా సిద్ధ‌రామ‌య్య వ‌ల్ల‌నే కూలిపోయింద‌నే ప్ర‌చారం ఒక‌టి ఉంది. ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ సిద్ద‌రామ‌య్య సీఎల్పీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇంత‌లోనే ఆయ‌న హృద‌య సంబంధ ఇబ్బందితో ఆసుప‌త్రి పాల‌య్యారు.

ప్రస్తుతం ఆయ‌న‌కు ప‌రామ‌ర్శ‌లు కొన‌సాగుతూ ఉన్నాయి. క‌ర్ణాట‌క సీఎం య‌డియూర‌ప్ప కూడా వెళ్లి సిద్ధ‌రామ‌య్య‌ను ప‌రామ‌ర్శించారు. ఇక సిద్ద‌రామ‌య్య చేసిన రాజీనామాను వెన‌క్కు తీసుకోవాల‌ని అంటూ కాంగ్రెస్ వాళ్లు కోరుతున్నార‌ట‌. అయితే అందుకు సిద్దూ సానుకూలంగా లేర‌ట‌. ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించార‌ట‌. ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల నుండి త‌ప్పుకోబోతున్న‌ట్టుగా ఆయ‌న తెలిపార‌ట‌. ఈ మేర‌కు కాంగ్రెస్ వాళ్ల‌కు స‌మాచారం ఇచ్చార‌ట‌. ఈ నేప‌థ్యంలో.. ఆయ‌న‌ను ఎలాగైనా రాజకీయాలలో కొనసాగేలా చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట ..