Begin typing your search above and press return to search.
సిద్ధరామయ్యకు 10కి 7 మార్కులు!
By: Tupaki Desk | 4 April 2018 11:18 AM GMTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటినుంచి అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. అయితే, ప్రజలను మతంపేరుతో విడగొట్టాలని సిద్ధరామయ్య చూస్తున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డ సంగతి తెలిసిందే. ఎలాగైనా కర్ణాటకలో గెలవాలని భావిస్తోన్న బీజేపీ ఒక వైపు.....కర్ణాటకలో అధికారం నిలబెట్టుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పుంజుకోవాలని కాంగ్రెస్ మరోవైపు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఓటర్ల అభిప్రాయంపై నిర్వహించిన సర్వేలో సిద్ధరామయ్యకు మంచి మార్కులు పడడం కాంగ్రెస్ శ్రేణులకు ఆనందం కలిగిస్తోంది. అసోసియేషన్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), దక్ష స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వేలో సిద్ధూ పాలనకు 10కు గానూ 7 మార్కులు దక్కాయి.
సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు 2017 డిసెంబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో ఆ సంస్థ సర్వే చేప్టటింది. కర్ణాటకలోని 225 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,244 మంది అభిప్రాయాలను ఆ సర్వేలో సేకరించారు. దివంగత మహానేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితల తరహాలోనే సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ పథకాలు కన్నడ ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రూపాయికి కిలో బియ్యం అందించే `అన్నభాగ్య` పథకం, అమ్మాయిలకు ఉచితంగా సైకిళ్లను ఇచ్చే `సైకిల్ భాగ్య` పథకం, రైతుల కోసం అమలుచేస్తోన్న `కృషి భాగ్య` పథకం, `మైనార్టీ`నవ దంపతులకు రూ.50 వేలందించే `షాదీ భాగ్య`ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించే `అనిల్ భాగ్య` పథకాలపై కన్నడిగులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, `అమ్మ`కేంటిన్ల తరహాలో ప్రవేశపెట్టిన `ఇందిర కేంటీన్ల` పథకానికి పెద్దగా ఆదరణ లభించలేదు. దివంగత మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన `ఆరోగ్య శ్రీ`తరహాలో గత నెలలో 2వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన `ఆరోగ్య భాగ్య` పథకానికి అనూహ్య స్పందన వస్తోంది.
ఓవరాల్ గా సిద్దూ పాలనకు 10కి 7 మార్కులు పడ్డాయి. పాఠశాలల నిర్వహణ (7.85) - విద్యుత్ సరఫరా (7.83) - ప్రజా రవాణా (7.61) - అవినీతి నిర్మూలన (6.77) సబ్సిడీ ధరలకే నిత్యావసర వస్తువులపంపిణీ (7.35), ఉద్యోగ అవSకాశాల కల్పన (6.70) వంటి అంశాల్లో సిద్దరామయ్య ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ సర్వే ఇచ్చిన ఊపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. రాబోయే ఎన్నికల్లో కూడా సంక్షేమ పథకాలే ప్రధానాస్త్ర్రంగా కాంగ్రెస్ - సిద్ధరామయ్య ముందుకు వెళితే గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.