Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీలో దొరికిపోయిన నటుడు.. అరెస్ట్

By:  Tupaki Desk   |   13 Jun 2022 5:30 AM GMT
రేవ్ పార్టీలో దొరికిపోయిన నటుడు.. అరెస్ట్
X
సినీ ఇండస్ట్రీకి ఈ రేవ్ పార్టీలు, డ్రగ్స్ కు అవినాభావ సంబంధం ఉంది. సినీ ప్రముఖులు అంతా ఈ పార్టీలో పాల్గొని కొంతమంది పట్టుబడిన వారే. ఇప్పటికే చాలా సార్లు పట్టుబడగా.. తాజాగా మరోసారి బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. పోలీసులు ఓ రేవ్ పార్టీపై దాడి చేసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు, నటుడు సిద్ధాంత్ కపూర్ ను అరెస్ట్ చేశారు.

ఆదివారం రాత్రి బెంగళూరులోని ఎంజీ రోడ్డులో ఓ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీపై రైడ్ చేసిన అధికారులు సిద్ధాంత్ కపూర్ ను అదుపులోకి తీసుకున్నాడు.

ఇతడితోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ దాడుల్లో సుమారు 35 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇక వీరి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపించారు. డ్రగ్స్ తీసుకున్నారని నిర్దారణ అయిన ఆరుగురిలో సిద్ధాంత్ కపూర్ ఒకరిని పోలీసులు తెలిపారు. వీరంతా డ్రగ్స్ తీసుకొని పార్టీకి వచ్చారా? లేదా పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నారా? తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలీవుడ్ లో తెరకెక్కిన పలు సినిమాల్లో సిద్ధాంత్ నటించారు. ‘భౌకాల్’, షూట్ ఔట్ వాడాలా’, అగ్లీ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.

గత ఏడాది ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ లభించడం.. అదే నౌకలో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉండడం సంచలనంగా మారింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు ఇటీవలే క్లీన్ చిట్ లభించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు దొరికిపోడం సంచలనమైంది.