Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లు యూపీకి వెళ్లాల్సిన టైమ్ ఇదే

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:01 AM GMT
ఆంధ్రోళ్లు యూపీకి వెళ్లాల్సిన టైమ్ ఇదే
X
ఒక చెంప మీద కొడితే మరో చెంప మీద కొట్టమని కోరటం గాంధీ సిద్ధాంతం. ఆయన ఉన్న రోజుల్లో అలాంటి మాట చెబితే.. అప్పటి మనుషులకు విషయం అర్థమయ్యేది. మారిన కాలంతో పాటు.. మనుషులు మరింత రాటు దేలిపోయారు. వారికి గాంధీ సిద్దాంతాన్ని ప్రదర్శిస్తే.. చేతకానితనంగా భావించేస్తున్నారు. అందుకే దెబ్బకుదెబ్బ తీయాల్సిన అవసరం ఉంది.

ఒక వ్యక్తిని మోసం చేస్తే ఓకే. కానీ.. ఒక రాష్ట్రం మొత్తాన్ని మోసం చేయటమే కాదు.. వెకిలి మాటలు మాట్లాడటం.. ముగిసిన అధ్యాయం అంటూ పుండు మీద కారం జల్లే మాటలు చెబుతున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నాటి ప్రధాని మన్మోహన్ పార్లమెంటులో ప్రకటించటం.. అందుకు వెంకయ్యనాయుడు లాంటోళ్లు ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని చెప్పటమే కాదు.. ‘‘మీరు ఓకే అన్నా కాకున్నా.. మేమే తర్వాత పగ్గాలు చేపడతాం. పదేళ్లు హోదా ఇచ్చేస్తాం’’ అంటూ బడాయి మాటలు చెప్పేశారు.

కేంద్రంలో ఎప్పుడైతే పూర్తిస్థాయి బలాన్ని సొంతం చేసుకున్నారో.. మోడీతో పాటు.. వెంకయ్యలాంటోళ్ల నోటి మాట పూర్తిగా మారిపోయింది. అందుకు తగ్గట్లే బీజేపీ నేతల నోటి మాటలు మారిపోయి.. హోదా ముగిసిన అధ్యాయంగా చెబుతున్న తీరు ఎక్కువైంది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారికి ఆంధ్రోళ్లు చక్కటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఇందుకు తగ్గట్లే తాజాగా చక్కటి అవకాశం ఒకటి వచ్చిందని చెప్పాలి.

ఏపీకి బీజేపీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించే సిద్దార్థ నాథ్ సింగ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు. ఏపీని మోడీ సర్కారు ఎంతగా మోసం చేసిందన్న విషయంతో పాటు.. సిద్దార్థ నాథ్ సింగ్ లాంటోళ్ల నోటి మాటలు ఎంతటి నీటి మూటలన్న విషయాన్ని ఆయన బరిలో ఉన్న ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏపీని దెబ్బేసేలా వ్యవహరించి.. ఇచ్చిన మాటను తప్పిన సిద్దార్థ్ కు ఆంధ్రోళ్లు తమ సత్తా చాటాల్సిందే. ఇందుకోసం ఆయన బరిలో ఉన్న అలహాబాద్ కు వెళ్లి ఆయన తీరును అక్కడి వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. మాట ఇచ్చి తప్పటమే కాదు.. ఎంత అహంకారంతో మాట్లాడతారన్న విషయాన్ని యూపీ మొత్తం కాకున్నా.. సిద్దార్థ నాథ్ సింగ్ బరిలో ఉన్న నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసి.. షాకివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/