Begin typing your search above and press return to search.
జనసేనకు షాక్ ఇచ్చిన బీజేపీ
By: Tupaki Desk | 2 Nov 2016 8:01 AM GMT2019 ఎన్నికలకు సంబంధించి పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ ఆ ఎన్నికలే టార్గెట్ గా కార్యాచరణలో మునిగిపోతున్నాయి. ఈ క్రమంలో 2014లో అరంగేట్రం చేసిన పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ అప్పట్లో ఎన్నికలకు దూరంగా ఉంది. కేవలం టీడీపీకి మద్దతిచ్చింది. బీజేపీ - టీడీపీ తరఫున జనసేనాని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు జనసేన ఎంతగానో కృషి చేసింది.
ఇక, ఇప్పుడు పొలిటికల్ గా ఉన్న మేటర్ ను బట్టి.. పవన్ ఎవరికి మద్దతిస్తారు? ఎవరితో కలిసి 2019 ఎన్నికల్లో పోటీకి దిగుతారు? వంటి అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే, వీటన్నింటికీ చెక్ పెట్టేలా బీజేపీయే తాజాగా ఓ ప్రకటన చేసింది. దీనిని బట్టి 2019లో పవన్ ఒంటరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఏపీ వ్యవహారాల బాధ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ విజయవాడ వచ్చారు. ఈ క్రమంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ వ్యవహారాలపై ఆయన స్పందిస్తూ.. అధికార టీడీపీతోకానీ - సీఎం చంద్రబాబుతో కానీ తమకు ఎలాంటి వివాదాలూ లేవని స్పష్టం చేశారు.
అదేసమయంలో, మీడియా ప్రతినిధులు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయంపై ప్రస్తావించారు. వాస్తవానికి ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ రావడం గమనార్హం. ఈ క్రమంలో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పవన్ పోల్చిన విధానంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి బదులివ్వని సింగ్.. ఆ ప్రశ్నను దాట వేశారు. అంతేకాకుండా, జనసేన పార్టీ.. బీజేపీతో జతకట్టలేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో జనసేన తమ పార్టీకి మద్దతు మాత్రమే తెలిపిందని చెప్పారు. రైతు సమస్యలపై ఈ నెల 26న తాడేపల్లిగూడెంలో బీజేపీ ర్యాలీ చేపట్టనుందని, ఈ ర్యాలీకి అమిత్ షా హాజరవుతారని సిద్దార్ధ నాథ్ సింగ్ తెలిపారు. సో.. ఈ పరిణామాలను బట్టి.. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే రంగంలోకి దిగే ఛాన్స్ కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/