Begin typing your search above and press return to search.

నాగాలాండ్ ఘటనపై నటుడు సిద్ధార్థ సంచలన ట్వీట్: వైరల్

By:  Tupaki Desk   |   7 Dec 2021 10:19 AM
నాగాలాండ్ ఘటనపై నటుడు సిద్ధార్థ సంచలన ట్వీట్: వైరల్
X
తెలుగు, తమిళ నటుడు సిద్దార్థ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సామాజిక అంశాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. సమాజంలో జరిగే సంఘటనలపై సిద్ధూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇటీవల నాగాలాండ్ లో జరిగిన సంఘటనపై ఆయన స్పందించాడు. అలాగే తమళనాడులో జరిగిన మరో సంఘటనతో పోలుస్తూ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. మొన్న సినిమా టిక్కెట్ల రేట్లపై కూడా సిద్ధూ ఆసక్తికర కామెంట్లు చేయడం విశేషం.

‘బాయ్స్’ సినిమాతో తెరంగేట్రం చేసిన సిద్దార్థ ఆ తరువాత తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. తమిళ సినిమాల్లోనూ తనదైన ముద్రవేసుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘మహాసముద్రం’ ఓటీటీ ద్వారా విడుదలయింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ యంగ్ నటుడు మధ్య మధ్యలో సినిమాల్లో కనిపిస్తున్నాడు. కొంతకాలంగా ఆయనకు అవకాశాలు రాకపోవడంతో సైడ్ హీరోగా కనిపించాడు. ఆ తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ హీరోగా కనిపిస్తున్నాడు.

ఇక సోషల్ మీడియాలో సిద్ధూ యాక్టివ్ గా ఉంటున్నారు. సరదా కామెంట్లు కాకుండా సమాజంలో జరిగే సంఘటనపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సినిమా టికెట్ల ధరలను నిర్ణయించి వాటికె అమ్మాలని జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిద్ధూ ‘సినిమాను బతికించడండి..టిక్కెట్ల రేట్లు తగ్గించి మా కడుపులు కొట్టకండి..’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది వైరల్ కావడంతో అయనకు అందరూ సపోర్టు చేశారు.

తాజాగా నాగాలాండ్ లో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. నాగాలాండ్ రాష్ట్రంలో తీవ్రవాదులు అనుకొని ఆర్మీ అధికారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 5గురు కూలీలు మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా హోం శాఖపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై సిద్ధూ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ ఖాతాలో ‘ఉగ్రవాదులు అనుకొని సామాన్యులపై కాల్పులు జరిపారు. తమిళనాడులో మరో కస్టోడియల్ డెత్ జరిగింది. ఈసారి స్టూడెంట్ ను బలి తీసుకున్నారు. జవాబుదారితనం ఎక్కడుంది..? కాపాడాల్సిన వారే ఇలా చేస్తే ఇంకెలా..? అంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఆయన పోస్టు కింద రకరకాల కామెంట్లు పెడుతున్నారు.