Begin typing your search above and press return to search.
12 గంటలు వరదలో డ్రైవర్..తాడు తెగడంతో గల్లంతు!!
By: Tupaki Desk | 16 Aug 2020 12:30 PM GMTసిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మోయతుమ్మెద వాగులో 12 గంటలుగా చెట్టును పట్టుకొని వేలాడుతున్న లారీ డ్రైవర్ చివరకు వాగులో కొట్టుకుపోయాడు. తాడు సాయంతో లాగడానికి ప్రయత్నించడం.. ఆ తాడు తెగడంతో వాగులో గల్లంతయ్యాడు. రెస్క్కూ టీం అధికారులు వెతుకుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతడి కోసం గాలిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలోని మోయతుమ్మెద పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
కాగా అర్ధరాత్రి 2 గంటలకు కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ కు ఇసుకలారీ లోడ్ తో బస్వాపూర్ వంతెనపై నుంచి వెళ్తుండగా వరద ధాటి లారీ వాగులోకి జారిపోయింది. క్లీనర్ కు ఈత రావడంతో వాగులో ఈది బయటకు రాగా.. డ్రైవర్ కు ఈత రాక చెట్ల కొమ్మలను పట్టుకొని 12 గంటలుగా అలానే ఉన్నాడు. తాజాగా రెస్క్యూ టైం తాడు వేయగా.. తెగి గల్లంతయ్యాడు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ వచ్చినా లారీ డ్రైవర్ ను కాపాడుకోలేకపోయారు.