Begin typing your search above and press return to search.

కలెక్టర్ సీరియస్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   26 Oct 2021 12:52 PM GMT
కలెక్టర్ సీరియస్ వార్నింగ్!
X
ఒక్కసారిగా కలెక్టర్ ఉగ్రరూపంతో ఊగిపోయారు. ఎక్కడంటే సిద్ధిపేటలో ఎరువులు, విత్తనాల డీలర్లతో నిర్వహించిన ఒక సమావేశంలో కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. మామూలుగా ఈ తరహాలో రెచ్చిపోవటం రాజకీయనేతల్లో చూస్తుంటాం. కలెక్టర్ స్ధాయి ఉన్నతాధికారులు మాత్రం ఎవరికి వార్నింగ్ ఇచ్చినా కాస్త హద్దుల్లోనే ఉంటారు. కానీ కలెక్టర్ మాత్రం అన్నీ హద్దులను దాటేసి డీలర్లు, రైతులను నోటికొచ్చినట్లు మాట్లాడేయటమే ఇపుడు సంచలనంగా మారింది.

యాసంగిలో వరి విత్తనాలు అమ్మితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తన ఆదేశాలను కాదని ఎవరైనా డీలర్లు విత్తనాలను అమ్మితే సంబంధిత ఏఈవోలు, వ్యవసాయాధికారులను సస్పెండ్ చేస్తాను ఖబడ్దార్ అంటు వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు అమ్మినట్లు తన దృష్టికి వచ్చినా సదరు డీలర్ లైసెన్సును రద్దు చేయించటమే కాకుండా షాపును మూయించేయటం ఖాయమన్నారు. వరి విత్తనాలు అమ్మే హక్కు ఎవరికీ లేదన్నారు.

తన ఆదేశాలను కాదని డీలర్లు ఎవరైనా సుప్రింకోర్టు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నా ఎట్టి పరిస్దితుల్లోను దుకాణాన్ని తెరిపించేది లేదన్నారు. అంటే కోర్టు ఆర్డర్ ను కూడా తాను లెక్కచేయనని కలెక్టర్ డైరెక్టుగా చెప్పేశారు. మామూలుగా ఇలాంటి మాటలు రాజకీయనేతలు మాట్లాడుతారు కానీ ఉన్నతాధికారులు ఎవరు మాట్లాడరని అందరికీ తెలిసిందే. నలుగురు కూర్చున్నపుడు ప్రైవేటు సంభాషణలు వేరు, పదిమందితో సమావేశమైనపుడు మాట్లాడేది వేరుగా ఉంటుంది.

ఒకసారి లైసెన్సు రద్దుచేసి డీలర్ షిప్పును రద్దు చేయించిన తర్వాత ఎంతటి ప్రజాప్రతినిధితో సిఫారసు చేయించినా తాను లెక్క చేయనన్నారు. ఒకవేళ తమకు పలుకుబడి ఉందికదాని ఎవరితో అయినా ఫోన్ చేయించినా షాపును మళ్ళీ మూయిస్తానన్నారు. తాను కలెక్టర్ గా ఉన్నంత వరకు మూసేసిన షాపులను తెరిపించేది లేదన్నారు. కలెక్టర్ తాజా వార్నింగ్ పై కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. కలెక్టర్ వార్నింగులు కేసీయార్ ఆలోచనను, పరిపాలనా తీరుతెన్నులను బయటపెడుతున్నాయని మండిపడ్డారు.