Begin typing your search above and press return to search.
సిద్దిపేట కలెక్టరేట్ లో కుక్కల రాజ్యం.. అదనపు కలెక్టర్ కు తీవ్ర గాయాలు
By: Tupaki Desk | 4 April 2023 11:37 AM GMTకుక్కల బెడద తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి పెట్టటం లేదు. ఒకటి తర్వాత ఒకటి గా తెర మీదకు వస్తున్న ఉదంతాలతో వరుస షాకులు తగులుతున్నాయి. ఇంతకాలం కుక్కల బారిన పడింది సామాన్యులు కాగా.. ఇప్పుడు ఏకంగా జిల్లా ఉన్నతాధికారికే అలాంటి చేదు అనుభవం ఎదురైంది. సిద్దిపేట కలెక్టరేట్ లో కుక్కలు క్రియేట్ చేసిన రచ్చకు అక్కడి ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి.
ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే.. సిద్ధిపేట శివారులో కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించటం.. అధికారులకు నివాసాల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. శనివారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస రెడ్డి తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఒక వీధి కుక్క ఆయనపై దాడి చేసి కరిచింది. ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
అదనపు కలెక్టర్ తో పాటు.. కలెక్టరేట్ కు దగ్గర్లోని ఒక ఫౌల్టీ ఫాంలో మరో బాలుడిని కూడా వీధి కుక్క దాడి చేసినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. కలెక్టర్ పెంపుడు కుక్క పై కూడా వీధి కుక్క దాడి చేసింది. దీంతో.. కలెక్టరేట్ తో పాటు.. కలెక్టరేట్ లోని ఉద్యోగులు కుక్కల గురించి ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అదనపు కలెక్టర్.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.