Begin typing your search above and press return to search.

వేదిక మీదనే మంత్రి మల్లారెడ్డి గాలి తీసిన కాంగ్రెస్ మహిళా నేత

By:  Tupaki Desk   |   4 July 2022 1:16 PM GMT
వేదిక మీదనే మంత్రి మల్లారెడ్డి గాలి తీసిన కాంగ్రెస్ మహిళా నేత
X

ఎంత ఎదిగినా ఇప్పటికీ మంత్రి మల్లారెడ్డి సాదాసీదాగానే ఉంటారు. అతి సామాన్యుడిలా వ్యవహరిస్తారు. ఆ సామాన్యత వెనుక మల్లారెడ్డి అంతులేని కష్టం దాగి ఉందని ఆయన గతాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయన తీరుతో అవి కాంట్రవర్సీకి మారుపేరుగా మారుతున్నాయి.

2019 ఫిబ్రవరిలో మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని.. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని కాంగ్రెస్ నాయకురాలు భవానీ రెడ్డి వేదిక మీదనే మంత్రి గాలి తీసేశారు. ముందు నీ శాఖ చూసుకో అంటూ ఎద్దేవా చేశారు.

తాజాగా టీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు భవానీ రెడ్డి సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చారు. ప్రజా సమస్యలపై వేదికపై మైక్ అందుకున్న భవానీ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ ను కడిగిపారేశారు. అడ్డువచ్చిన మంత్రి మల్లారెడ్డిని ‘మల్లన్నా.. మల్లన్నా.. మీరు కూసోండే..’ అంటూ వేదికపైనే కూర్చుండబెట్టి కడిగేసింది.

2019 ఫిబ్రవరిలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మల్లారెడ్డి ఇంత వరకూ ఒక్క రివ్యూ చేపట్టలేదని ఆరోపించారు. అప్పటి నుంచి కార్మికశాఖకు కమిషనర్ లేరని.. డిప్యూటేషన్ మీద తీసుకున్నారని.. మన దగ్గర ఐఏఎస్ లు లేరా? అని ప్రశ్నించారు. రూ.2వేల ప్రీమియం కట్టకపోతే 10 లక్షల మంది కార్మికులపై ప్రభావం పడిందని భవానీ రెడ్డి ఆరోపించారు.

ఇక్కడకొచ్చి వేదికలపై చాలా చేసినం అని మాట్లాడడం కాదని.. నీ కార్మికశఆఖ కుంటుపడిందని.. కార్మికుల వేతనాలు పెంచాలని నిరవధిక సమ్మె చేపడుతున్నారని.. వారికి వేతనాలు పెంచితే.. సార్ గారి ఇన్ స్టిట్యూట్లలో ఉన్న వారందరికీ వేతనాలు పెంచాల్సి వస్తోందన్నారు. ఈయనపై కోట్లాది రూపాయల భారం పడుతుందని భవానీ రెడ్డి వ్యాఖ్యానించారు.

వేదిక ఏదైనా సరే టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టి మంత్రి మల్లారెడ్డికి.. టీఆర్ఎస్ కంచుకోట అయిన సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకురాలు ఈ షాకివ్వడం గమనార్హం.