Begin typing your search above and press return to search.
సిద్ధిపేట బోర్డు ఇప్పుడెందుకంత వైరల్?
By: Tupaki Desk | 9 Aug 2018 5:04 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన ప్రాంతంగా.. ఆయన మేనట్లుడు హరీశ్ రావు అనుక్షణం ఆరాటపడే సిద్ధిపేట వార్తల్లోకి వచ్చింది. ఈ పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక బోర్డు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వైరల్ అయ్యింది. పలు అంశాలపై సైన్ బోర్డులు చూసి ఉంటారు కానీ.. ఈ తరహా సైన్ బోర్డును మాత్రం మరెక్కడా చూసి ఉండరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకీ ఆ బోర్డు ఏంటి? అందులో ఏముంది? అన్నది చూస్తే.. సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట టౌన్ లోని కోమటి చెరువుసమీపంలో వ్యభిచార గృహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. వ్యభిచారం చేసే గృహాలు అదే తరహాలో సాగుతున్నాయి.
ఎన్ని సంస్కరణలకు ప్రయత్నించినా ఫలితం లేనట్లుగా ఉండేది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన యాదగిరిగుట్ట సెక్స్ స్కాండల్ బయటకు రావటం.. పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే. పసి పిల్లల్ని.. చిన్నారుల్ని తీసుకొచ్చి యుక్త వయసుకు రాకముందే.. హార్మోన్ ఇంజెక్షన్లతో వారిని పెద్దవారిలా కనిపించేలా చేసి.. బలవంతంగా వ్యభిచారం చేయించే దుర్మార్గం బయటకు వచ్చింది.
ఈ నేపథ్యంలో సిద్ధిపేటలోని కోమటిచెరువు సమీపంలోని వ్యభిచారం గృహాల మీద కూడా వరుస కథనాలు మీడియాలో వచ్చాయి. దీంతో.. ఇక్కడ వ్యభిచార గృహాలు నిర్వహించే వారు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాము వ్యభిచారాన్ని స్వచ్ఛందంగా ఆపేస్తున్నామని.. ఇకపై తమ వద్దకు విటులెవ్వరూ రావొద్దంటూ బోర్డు పెట్టేశారు.
పడుపు వృత్తిని స్వచ్చందంగా మానేస్తున్నాం. ఎవరైనా సరే విటులు వచ్చి బలవంతంగా చేస్తే.. పోలీసులకు అప్పగిస్తాం అంటూ పెట్టిన బోర్డు ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.