Begin typing your search above and press return to search.
రష్యా వ్యాక్సిన్ దెబ్బేసినట్లేనా.. క్లినికల్ ట్రయల్స్‌లో సైడ్ఎఫెక్ట్స్ !
By: Tupaki Desk | 21 Sep 2020 5:37 PM GMTరష్యా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో ఆశించిన ఫలితాలు రావడం లేదా.. మూడో దశలో భాగంగా ఇచ్చిన క్లినికల్ ట్రయల్స్ తీసుకున్న దాదాపు 14 శాతం మందికి సైడ్ఎఫెక్ట్స్ వచ్చాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. రష్యా ప్రభుత్వం హడావిడిగా, ప్రతిష్ఠాత్మకంగా స్పుత్నిక్-వి పేరుతో కరోనాకు వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా మేమే వ్యాక్సిన్ తీసుకొచ్చామంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించాడు. అంతేకాక తన కూతురికే తొలి వ్యాక్సిన్ ఇప్పించి సంచలనం సృష్టించాడు. అయితే మొదటి నుంచి ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల శాస్త్రవేత్తలు అభ్యంతరం తెలిపారు. మరోవైపు రష్యా క్లినికల్ ట్రయల్స్ డాటాను బయటకు చెప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాగా కొన్ని ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్స్ రష్యా వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చిందని.. వ్యాక్సిన్ తీసుకున్న వారందరిలోనూ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయని వార్తలు ప్రచురించాయి.
అయితే ఈ వ్యాక్సిన్‌పై పలు దేశాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే ఈ విషయంలో రష్యా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కాగా తాజాగా రష్యా ఆరోగ్య మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ‘ క్లినికల్ ట్రయల్స్ భాగంగా మేము వలంటీర్లకు వ్యాక్సిన్లు ఇచ్చాం. అయితే 14 శాతం మందిలో ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి లక్షణాలు వచ్చాయి.
ఇది చాలా సర్వసాధారణమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా వ్యాక్సిన్లలో ఇటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని వల్ల వ్యాక్సిన్‌కు వచ్చిన ముప్పు ఏమీ లేదు. మూడో క్లినికల్ ట్రయల్స్‌లో 300 వలంటీర్లలో కేవలం 14 శాతం మందికి మాత్రమే స్వల్ప సైడ్ఎఫెక్ట్స్ వచ్చాయి.
ఎవరూ ఆందోళన చెందవలిసిన అవసరం లేదు. వారికి వచ్చిన అనారోగ్యం కేవలం 2 లేదా 3 రోజుల్లో తగ్గిపోతుంది. కొంతమంది పనిగట్టుకొని రష్యా వ్యాక్సిన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారి ఉద్దేశాలు ఏమిటో మాకు స్పష్టం తెలుసు’ అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికోసం రష్యా ప్రభుత్వం ఓ యాప్‌ను రూపొందించింది. ఒకవేళ ఎవరికైనా వ్యాక్సిన్ వేయించుకున్నాక అనారోగ్యంగా అనిపిస్తే యాప్ ద్వారా ఆయన సూచించారు. వారికి వైద్యసిబ్బంది తగిన వైద్యసహాయం అందిస్తారని చెప్పారు. అయితే ప్రస్తుతం రష్యా అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ విజయవంతమై మనదేశంలో కూడా అందుబాటులోకి రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.