Begin typing your search above and press return to search.
ఆనందయ్య మందు పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలకపల్లి రవి .. ఆ మందు అంతా ఓ .. !
By: Tupaki Desk | 26 May 2021 10:30 AM GMTఆనందయ్య నాటు మందుపై సీసీఆర్ ఏఎస్ పరిశోధన ఎటూ తేలడం లేదు. ప్రస్తుతానికి మందు తీసుకున్న వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ అభిప్రాయ సేకరణలో అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ ఆనందయ్య నాటు మందు వాడిన 500 మందిని ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు అధికారులు. వారిలో 92 మంది ఫోన్ లిఫ్ట్ చేయలేదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. 42 మంది మందే తీసుకోలేదని చెప్పారు. 36 మంది రోగుల జాబితాలో ఒకటే ఫోన్ నెంబర్ ఉంది.మందు తీసుకున్న వారిలో ఎక్కువ మంది కరోనా రాకముందే మందు తీసుకున్నట్టు వెల్లడైంది. ఇప్పటి వరకూ మందు తీసుకున్న వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. మరిన్ని నెంబర్లు పంపాలంటూ నెల్లూరు అధికారులను కోరారు వైద్యులు. రోగుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తేనే తర్వాత పరిశోధన ఉంటుందన్నారు వైద్యులు. అయితే , దీనిపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో అయన ఏం చెప్పారో వివరాల్లోకి వెళ్తే ..
"చాలా ముఖ్యమైన వార్త కాబట్టి , ఇతర మీడియాల్లో చెప్పడానికి కొంచెం సంకోచిస్తారు కాబట్టి నేను చెప్తున్నా .. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు ఆనందయ్య నాటు మందు తీసుకున్న వారిలో 6 మంది మరణించారని ప్ ప్రముఖ పత్రికలో పతాక శీర్షిక లో వచ్చిందని అన్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 36 మంది ఈ మందు తీసుకున్న తరువాత చోటుచేసుకున్న దుష్పరిణామాలకు చికిత్స పొందుతున్నారని అన్నారు. వీరిలో పలువురికి ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వీరికోసం ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేసి మరీ చకిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే చనిపోయిన ఆరు మంది వివరాలు కూడా లేవని ,ఎందుకంటే మరణించిన వారు పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన వారని , వారు మందు కోసమే ఇక్కడికి అంబులెన్స్ లో వచ్చారని అన్నారు. వారికి సీరియస్ గా ఉన్న సమయంలోనే .. ఆనందయ్య నాటుమందు గురించి జరిగిన ప్రచారంతో అంబులెన్స్ ల్లో వీరిని తీసుకువచ్చారని, మందు తీసుకున్న తరువాత పరిస్థితి మెరుగుపడకపోగా, మరింతగా విషమించడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారని తెలిసింది. అప్పటికే పరిస్థితులు చేయిజారి పోవడంతో ప్రభుత్వాస్పత్రి వైద్యులు సైతం ఏమీ చేయలేకపోయారు.
నాటుమందు పంపిణీ వివాదాస్పదంగా మారడంతో ఈ విషయం గురించి ఆస్పత్రి సిబ్బంది పెదవివవిప్పడం లేదు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్న ఆనందయ్య నాటుమందు బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఆరుమంది చనిపోయిన విషయాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు బహిరంగంగా ప్రకటించడానికి సముఖత వ్యక్తం చేయడం లేదని , ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం తో తమ మెడకి ఏ వివాదం చుట్టుకుంటుందో అని జంకుతున్నారు. అలాగే రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్య స్థితితో పాటు, మిగిలిన వారి ఆరోగ్య సమస్యలు పెరిగినట్టు తెలిపారు. కోటయ్య ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స తీసుకుంటున్నారని , అయన ఆరోగ్య పరిస్థితి పై అయన కుమారుడిని అడగ్గా .. అంతా బాగుంది అంటూ మాట దాటేస్తున్నాడు అని అన్నారు. ఇది నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారం అని అనధికారంగా తెలియవస్తున్న సమాచారం అని చెప్తున్నారు. కానీ, దీనిపై ప్రభుత్వం నోరు విప్పడం లేదు అలాగే రాష్ట్రంలో విపక్షం , ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అని అన్నారు.
ఈ పరిస్థితి పై ఇప్పటికే వైద్యులు ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోవాలని , ఇప్పటికే ప్రమాదం లో ఉన్న వారిని కాపాడటం తో పాటుగా , భవిష్యత్ లో వచ్చే వారి విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇంకో ముఖ్యమైన విషయం .. ఢిల్లీ లో ఆయుర్వేదం మీద పరిశోధన చేసే సంస్థ వారు ఓ విషయం చెప్పారని ,ఆయుష్ చెప్పిన నివేదిక మొత్తం కూడా కరోనా పెద్దగా లేని వారి ఆ అధ్యయనం చేసారు తప్ప ,ఎక్కువగా ఉండి మందు తీసుకున్నవారి పై కాదని వారు చెప్తున్నారు అని అన్నారు. కాబట్టి ఆ 500 మంది విచారించారని మందు పై ఓ నిర్ణయం తీసుకోలేము ,ఇప్పుడు చనిపోయిన వారు , ప్రాణం మీదకి వచ్చినవారు ఉన్నారు కాబట్టి , దానిపై వాదోపవాదాలు కాకుండా ఒక ఖచ్చితమైన శాస్త్రీయమైన దృష్టి తో వ్యవహరించాలని , ప్రజల ప్రాణాలు కాపాడటం చాలా ముఖ్యం అని అన్నారు. ఆయనకి మరింత భద్రత కల్పించవచ్చు , అలాగే దానిమీద మరింత పరోశోధన చేయచ్చు కానీ వేల మంది ఆ మందుని నమ్ముకొని ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి తీసుకురాకుండా చేయాలని కోరారు".. ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి. ఈ విషయాలని అయన తన తెలకపల్లి మీడియా ద్వారా వెల్లడించారు.