Begin typing your search above and press return to search.

ఆప్‌ కు షాక్ః సిద్దూ కొత్త పార్టి

By:  Tupaki Desk   |   2 Sep 2016 4:28 PM GMT
ఆప్‌ కు షాక్ః సిద్దూ కొత్త పార్టి
X
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ కు త‌గులుతున్న షాక్‌ల ప‌రంప‌ర‌లో మ‌రో షాక్ వ‌చ్చిచేరింది. మాజీ క్రికెట‌ర్‌ - బీజేపీ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన న‌వ్‌ జ్యోత్ సింగ్ సిద్దు ఏ పార్టీలో చేర‌తార‌న్న స‌స్పెన్స్‌ కు తెర‌ప‌డింది. ఆప్‌ లో చేర‌తార‌న్న ఊహాగానాల‌కు చెక్ పెడుతూ ఏకంగా కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆవాజ్‌-ఎ-పంజాబ్ పేరుతో కొత్త పార్టీకి ఆయ‌న నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ నెల 9న ఈ కొత్త పార్టీ ప్రారంభ‌మ‌వ‌నుంది. హాకీ ప్లేయ‌ర్ ప‌ర్గ‌త్‌ సింగ్‌ - స్వతంత్ర ఎమ్మెల్యే సిమ‌ర్జిత్ సింగ్ బైన్స్‌ల‌తో క‌లిసి సిద్దు ఈ పార్టీ ఏర్పాటుచేయ‌నున్నారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ ను సిద్దు భార్య న‌వ్‌ జ్యోత్ కౌర్ త‌న ఫేస్‌ బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న సిద్ధూ జులైలో త‌న ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు ఆ త‌ర్వాత కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల్లో చేర‌తార‌ని ఊహాగానాలు వెలువ‌డ్డాయి. అర‌వింద్ కేజ్రీవాల్‌ తో కొన్ని వారాల పాటు ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే త‌న‌నే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌న్న సిద్దు డిమాండ్‌ కు ఆమ్ ఆద్మీ పార్టీ అంగీక‌రించ‌లేదు. అనంత‌రం కాంగ్రెస్ వైపు వెళ‌తార‌నే చ‌ర్చ సాగింది. ఈ క్ర‌మంలోనే హ‌ఠాత్తుగా సిద్ధూ త‌మ పార్టీని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన సిమ‌ర్జిత్ బైన్స్ మాట్లాడుతూ త‌మ పార్టీ సీఎం అభ్య‌ర్థి సిద్దునేన‌ని ప్ర‌క‌టించారు. త‌మ విధానాల‌కు మ‌ద్ద‌తు ప‌లికే వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని వెల్ల‌డించారు. అకాలీద‌ళ్‌, కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీల‌క ప్ర‌త్యామ్నాయంగా కొత్త ఫ్రంట్‌ ను మొద‌లుపెడ‌తామ‌ని చెప్పారు. కొత్త రాజ‌కీయాల‌తో పంజాబ్ ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందిస్తామ‌ని తెలిపారు.