Begin typing your search above and press return to search.
సిద్దూ పంతం నెగ్గింది.. పంజాబ్ సీఎంతో సయోధ్య కుదిరింది..
By: Tupaki Desk | 10 Nov 2021 2:30 AM GMTపంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పంతం నెగ్గించుకున్నాడు. తన ప్రధాన డిమాండ్లలో ఒక్కటైన అడ్వకేట్జనరల్ ఏపీసీ డియోల్ ను ఆ పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ ను సిద్ధూ నెరవేర్చుకున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి సమర్పించిన రాజీనామాను ఉప సంహరించుకునేందుకు గత వారం సుముఖత వ్యక్తం చేసిన సిద్ధూ అయితే అడ్వకేట్జనరల్ పదవి నుంచి ఏపీసీ డియోల్ ను తప్పించాలని కండీషన్ పెట్టారు. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ తన పదవికి రాజీనామా చేయగా.. దీన్ని సీఎం చరణ్ జిత్ చన్నీ ఆమోదం తెలిపారు. దీంతో సిద్ధూ, చన్నీ మధ్య సయోధ్య కుదిరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సన్నిద్ధం చేయడంపై వారిద్దరూ దృష్టిసారిస్తానని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే సిద్దూతో విభేదాల కారణంగా పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చన్నీ సీఎంగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో సిద్దూతో నెలకొన్న విభేదాల కారణంగా సీఎం చన్నీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
అడ్వకేట్ జనరల్ ఏపీఎస్ డియోల్ రాజీనామాను పంజాబ్ కేబినెట్ ఆమోదించినట్టు సీఎం చన్నీ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ సమయంలో సిద్ధూ కూడా ఆయన పక్కనే ఉన్నారు. కొత్త అడ్వకేట్ జనరల్ ను బుధవారం నియమించనున్నట్టు సీఎం తెలిపారు.