Begin typing your search above and press return to search.
అక్టోబర్లో ఆక్స్ ఫర్డ్ టీకా : ఎస్ ఐఐ సీఈవో!
By: Tupaki Desk | 23 July 2020 5:44 AM GMTకరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణతో అల్లాడిపోతున్న ప్రపంచం టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII ) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్ కల్లా టీకా అందుబాటులోకి వస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. దేశంలో వచ్చే నెల లో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎస్ ఐ ఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్’ తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు పూనావాలా తెలిపారు.
ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. ఇక, దేశీయంగా ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ టీకాను మానవులపై ప్రయోగించేందుకు భువనేశ్వర్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ ఎస్ యూఎంలో స్క్రీనింగ్ ప్రారంభమైందని తెలిపారు . అయితే, అక్టోబరు నాటికి ఆక్స్ ఫర్డ్ టీకా వస్తుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో పూనావాలా చెప్తుంటే , టీకా డిసెంబర్ లో అందుబాటులో వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ చైర్మన్ చెప్పడం గమనార్హం. ఆక్స్ ఫర్డ్ టీకా తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, ఆస్ట్రియాలో రెండు, మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.