Begin typing your search above and press return to search.

అమెరికా సిక్కు కుటుంబం హత్య: కోర్టులో అస్సలు బాధపడని నిందితుడు

By:  Tupaki Desk   |   14 Oct 2022 11:30 AM GMT
అమెరికా సిక్కు కుటుంబం హత్య: కోర్టులో అస్సలు బాధపడని నిందితుడు
X
అమెరికాలో హత్యకు గురైన భారత సంతతి కుటుంబం హత్య కేసు గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల పసికందుతో సహా భారతీయ సంతతికి చెందిన సిక్కు కుటుంబానికి చెందిన నలుగురిని కిడ్నాప్ చేసి చంపిన కేసులో నిందితులు కోర్టులో ఉన్న అన్ని అభియోగాలను ఖండిస్తూ తాను నిర్దోషి నంటూ వాదించాడు. ఈ విచారణలో తాను ఏ తప్పు చేయలేదని నిందితుడు వాదించాడు. తన మాటల్లో కొంత కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం అందరినీ విస్తుగొలిపింది. ఈ కేసు డిసెంబర్ 15వ తేదీకి మళ్లీ విచారణ వాయిదా వేశారు.

గురువారం జీసస్ సల్గాడో సంకెళ్లతో భద్రతా నడుమ మెర్సిడ్ కౌంటీ సుపీరియర్ కోర్టుకు హాజరయ్యాడు. తుపాకీతో కాల్చడం.. స్వాధీనం చేసుకోవడంతో పాటు, ప్రత్యేక పరిస్థితులతో ఫస్ట్-డిగ్రీ హత్యకు సంబంధించిన నాలుగు ఆరోపణలతో అతనిపై పోలీసులు అభియోగాలు మోపారు. నేరం రుజువైతే పెరోల్‌కు అవకాశం లేకుండా తన జీవితాంతం జైలులో గడపవచ్చు.

డిసెంబరు 15న సల్గాడో మళ్లీ కోర్టుకు హాజరు కానున్నారు. శనివారం టర్లాక్‌లో చనిపోయిన సిక్కు కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు ప్రకటించారు. అంత్యక్రియల కోసం స్థానిక భారతీయులు భారీగా తరలివచ్చారు. కుటుంబానికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు.

ఎనిమిది నెలల అరూహి ధేరి, ఆమె తల్లిదండ్రులు జస్లీన్ కౌర్(27), జస్దీప్ సింగ్(36), ఆమె మామ అమన్‌దీప్ సింగ్ (39) మృతదేహాలు ఇండియానా మరియు హచిన్స్ రోడ్ల కూడలికి సమీపంలో ఉన్న "అత్యంత మారుమూల" తోటలో కనుగొనబడ్డాయి.

ఈ హత్యకు పాల్పడ్డ నిందితుడు సల్గాడోకు చనిపోయిన సిక్కు కుటుంబంతో చాలా కాలంగా వైరం ఉందని.. వారి ట్రక్కింగ్ వ్యాపారంలో ఇతడు మాజీ ఉద్యోగి అని తేలింది. ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో కుటుంబాన్ని హత్య చేశాడని సమాచారం.

అక్టోబరు 4న అతడిని అరెస్టు చేసేందుకు అధికారులు రాకముందే ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు వైద్య చికిత్స పొందాడు. అనంతరం కోలుకోవడంతో నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. సల్గాడోకు మరణశిక్ష విధించాలని స్థానిక మేయర్, భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.