Begin typing your search above and press return to search.
సిక్కు టెక్కీ పై అమెరికాలో దాడి
By: Tupaki Desk | 8 Oct 2016 10:16 AM GMTభారతీయుల విషయంలో ఒక్కోసారి అమెరికా ప్రవర్తనను మూర్ఖత్వం అనాలో - చదువుకున్న అజ్ఞానం అనాలో లేక కావాలని చేస్తున్న కవ్వింపు చర్యలనాలో కానీ భారతీయులపై ఏదో ఒక మూల జాతి విద్వేష దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అమెరికాలో ఒక భారతీయుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదని ఇటు భారతీయ విదేశాంగకూ తెలుసు, అటు అమెరికా ప్రభుత్వానికి తెలుసు! ఇక విషయానికొస్తే... సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న 41 ఏళ్ల సిక్కు వ్యక్తిపై కొందరు దారుణంగా దాడికి పాల్పడ్డారు.
కాలిఫోర్నియాలో ఐటీ స్పెషలిస్టుగా పనిచేస్తున్న మాన్ సింగ్ ఖల్సా... సెప్టెంబర్ 25 రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనం మీద కొందరు యువకులు బీరు క్యాన్ విసిరారు. అయినా దాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతున్న మాన్ సింగ్ ను ఆ యువకులు వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు తెరిచి ఉంచడంతో వాటిలోంచి ఆయనపై దాడి చేశారు. ఆయన తలపాగాను లాగేసి, జీవితంలో ఒక్కసారి కూడా కత్తెర పడనివ్వని అతని జుట్టును చాకుతో కత్తిరించి తీవ్రంగా అవమానించారు. దీనిపై సిక్కు సంఘాలు తీవ్రంగా మండిపడుతుండగా.. జాతివిద్వేష దాడి కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే ఈ దాడికి పాల్పడినవారంతా 20 నుంచి 30ల లోపు వయసువాళ్లేనని, ఐదారుగురు శ్వేతజాతి యువకులు తనను తిడుతూ శారీరకంగా దాడి చేశారని ఖల్సా చెప్పారు. రిచ్‌మండ్ పోలీసు డిపార్టుమెంటుకు సిక్కు సంఘం ఈ మేరకు ఫిర్యాదుచేసింది. శ్వేతజాతి యువకులు కేవలం శారీరకంగా దాడి చేయడమే కాక.. తన మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీశారని ఖల్సా ఒక ప్రకటనలో తెలిపారు. 9/11 దాడుల తర్వాతి నుంచి ఈ 15 ఏళ్లలో సిక్కులపై వందలాది సార్లు దాడులు జరిగాయని సిక్కు సంఘం ఈ సందర్భంగా ఆరోపించింది. ఈ దాడిలో మాన్ సింగ్ ఖల్సా కన్ను వాచిపోగా - చేతి వేళ్లు తెగిపోయాయి. కళ్లు - పళ్లు - చేతుల మీద కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/