Begin typing your search above and press return to search.
రాకేశ్ తో పరిచయం ఎలానో చెప్పిన శిఖా!
By: Tupaki Desk | 8 Feb 2019 5:53 AM GMTసంచలనంగా మారిన ప్రవాసాంధ్రుడు జయరామ్ హత్య ఉదంతంలో పలు ఆరోపణలు ఎదుర్కొని.. ఏపీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన శిఖా చౌదరి తొలిసారి ఒక చానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేశ్ తో శిఖా పరిచయంపై చాలానే కథనాలు వచ్చాయి.
మరి.. రాకేశ్ తో శిఖా పరిచయం ఎలా జరిగింది? అతనితో స్నేహం సంగతి మాటేమిటి? తాజా స్టేటస్ ఏమిటన్న విషయాన్ని శికా వెల్లడించారు. అసలు రాకేశ్ రెడ్డితో తన పరిచయం గురించి వెల్లడించిన శిఖా ఏమన్నారంటే.. మేనమామ జయరామ్ కు చెందిన టెట్రాన్ కంపెనీలో కార్మికుల సమస్య తలెత్తినప్పుడు ఇష్యూను తాను సెటిల్ చేస్తానని రాకేశ్ ముందుకు వచ్చాడని.. అలా 2017లో పరిచయమయ్యాడని చెప్పింది.
అప్పటి వరకూ రాకేశ్ ఎవరో మామయ్యకు తెలీదన్న శిఖా.. తనతో తరచూ మాట్లాడేవాడని పేర్కొంది. అయితే.. అతని ప్రవర్తన నచ్చన తొమ్మిది నెలల నుంచి అతడి ఫోన్ నెంబర్ ను తీసేశానని.. అతన్ని పక్కన పెట్టినట్లుగా చెప్పింది. మామయ్యను కలిసిన సందర్భంలోనూ రాకేశ్ గురించి చెప్పి.. అతని నెంబర్ ను తీసేయాలని చెప్పినట్లుగా పేర్కొంది.
రాకేశ్ దగ్గర మామయ్య రూ..4 కోట్లు అప్పుగా తీసుకున్న విషయం తనకు తెలీదని చెప్పారు. మామ మరణం తర్వాతే రాకేశ్ అప్పు గురించి తనకు తెలిసిందన్నారు. మామయ్య విలువ తెలిసిన వారు ఎవరూ ఆయన్ను చంపితే లాభం వస్తుందని ఎవరూ అనుకోరని.. ఆయనతో కలిసి పని చేస్తే లాభపడతారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ కేసును మొదట్నించి హైదరాబాద్ పోలీసులు విచారణ చేయనున్నట్లు చెబుతున్నారు. విచారణలో భాగంగా శిఖా చౌదరిని పోలీసులు విచారిస్తారని చెబుతున్నారు. మరి.. ఏపీ పోలీసులు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చిన శిఖా విషయంలో తెలంగాణ పోలీసులు మరెలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.