Begin typing your search above and press return to search.

అదీ భారత్ అంటే: మసీదు కట్టించిన సిక్కులు

By:  Tupaki Desk   |   11 Sep 2015 9:33 AM GMT
అదీ భారత్ అంటే: మసీదు కట్టించిన సిక్కులు
X
భిన్నత్వంలో ఏకత్వం అనే మాటలోని గొప్పతనం చాలామందికి అర్థం కాదు. మరెక్కడా లేనంత విలక్షణత భారతీయ సమాజంలోనే ఉందని.. ఇక్కడి ప్రజల మద్య ఉన్న మతసామరస్యం మరెక్కడా ఉండదని.. అలాంటిది ఒక్క భారతీయులకే సాధ్యమనిపించే ఘటన తాజాగా చోటు చేసుకుంది. తన గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులు నమాజ్ కోసం.. పది కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ మసీదు లేని నేపథ్యంలో.. ఒక సిక్కు వ్యక్తి మసీదు నిర్మాణం చేపట్టి.. పూర్తి చేసిన ఘటన ఇది.

పంజాబ్ లోని సర్వాపూర్ అనే చిన్న గ్రామంలో గతంలో ఒక మసీదు ఉండేది. కానీ.. కొన్నేళ్ల కిందట జరిగిన గొడవల్లో దాన్ని కూల్చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలోని ముస్లింలు ప్రార్థనల నిమిత్తం.. ఊరికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న మసీదుకు వెళ్లి వస్తుండేవారు. ఈ ఘటనపై ఒక సిక్కు రైతు జోగా సింగ్ కు అస్సలు నచ్చలేదు.

ప్రార్థనల కోసం అంత దూరం ప్రయాణించటం ఏమిటి? గ్రామంలోనే మసీదు నిర్మిస్తే సరిపోదని పూనుకొని.. అక్కడి వారితో సమావేశం ఏర్పాటు చేసి.. తానే దగ్గరుండి మసీదును నిర్మించాడు. దీంతో.. గ్రామంలోని ముస్లిం సోదరుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి. జోగాసింగ్ కానీ పూనుకోకపోతే తమకు మసీదు వచ్చేది కాదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లోని భిన్నత్వంలో ఏకత్వానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుందని చెప్పక తప్పదు.