Begin typing your search above and press return to search.

ప‌క్క రాష్ర్టాన్ని 60వేల కోట్లు డిమాండ్ చేశారు

By:  Tupaki Desk   |   7 July 2017 7:26 AM GMT
ప‌క్క రాష్ర్టాన్ని 60వేల కోట్లు డిమాండ్ చేశారు
X
ప‌్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాల్లో కొత్త ఎపిసోడ్ ఇది. వేర్పాటువాద పోరాటాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప‌శ్చిమ‌ బెంగాల్‌ కు షాకివ్వ‌డానికి సిక్కిం సిద్ధ‌మ‌వుతోంది. బెంగాల్‌ లో సాగుతున్న గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం వ‌ల్ల తాము తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని సిక్కిం ఆరోపిస్తోంది. అందువ‌ల్ల త‌మ‌కు రూ.60 వేల కోట్లు ఇప్పించాల‌ని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని సిక్కిం భావిస్తోంది.

గ‌త 32 ఏళ్లుగా గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం వ‌ల్ల త‌మ రాష్ట్రం రూ.60 వేల కోట్లు న‌ష్ట‌పోయింద‌ని సిక్కిం వాదిస్తోంది. సిక్కిం రిజిస్ట్రేష‌న్‌ తో ఉన్న వాహ‌నాల‌పై దాడులు జ‌ర‌గ‌డాన్ని సిక్కిం సీఎం ప‌వ‌న్ చామ్లింగ్ ఖండించిన మ‌రుస‌టి రోజే ఆ రాష్ట్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. చైనా - బెంగాల్ మ‌ధ్య న‌లిగిపోవ‌డానికి సిక్కిం ప్ర‌జ‌లు త‌మ రాష్ట్రాన్ని ఇండియాలో క‌ల‌ప‌లేద‌ని చామ్లింగ్ తీవ్రంగా స్పందించారు. గూర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని చామ్లింగ్ స‌మ‌ర్థించారు. అంతేకాదు ఇది ఎన్నో ఏళ్ల పోరాట‌మంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ కు కూడా ఆయ‌న లేఖ రాశారు. దీంతో బెంగాల్‌ లో సిక్కింకు వ్య‌తిరేకంగా ఆ రాష్ట్ర వాహ‌నాల‌పై దాడులు జ‌రిగాయి.

ఇదిలాఉండ‌గా...పశ్చిమ బెంగాల్‌ లోని బషీర్‌ హాట్‌ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ - గాల్లో కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో..పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉత్తర 24 పరగణ జిల్లాలో హింసకు ప్రభావితమైన బధురియాలో జనజీవనం నెమ్మదిగా కుదుటపడుతున్నది. మరో వైపు ఆ ప్రాంతాల్లో బీజేపీ ఎంపీల బృందా న్ని పంపించనున్నట్టు అమిత్‌ షా ప్రకటించారు. దీంతో రాజకీయ వేడి మరింత ఎక్కువకానున్నదని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.