Begin typing your search above and press return to search.

యువతపై ’సైటెంట్ కిల్లర్’ దాడి

By:  Tupaki Desk   |   9 May 2021 4:37 AM GMT
యువతపై ’సైటెంట్ కిల్లర్’ దాడి
X
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా యువతపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. యువతకు కరోనా వైరస్ సోకినా తొందరగా లక్షణాలు బయటపడకపోవటంతోనే అంతర్గతంగా ముదిరిపోతోంది. అప్పుడు బయటపడటంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారట. వైరస్ అప్పటికే బాగా ముదిరిపోయిన కారణంగా ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉపయోగం లేకపోవటంతో మరణిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

యువతపై జరుగుతున్న కరోనా వైరస్ ను వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు. మామూలుగా అయితే పెద్దవాళ్ళల్లో కానీ పిల్లల్లో కానీ కరోనా సోకిందంటే వెంటనే లక్షణాలు బయటపడిపోతున్నాయి. దాంతో వెంటనే ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు. అదే యువత విషయంలో కరోనా లక్షణాలు తొందరగా బయటపడదు. కరోనా వైరస్ సోకిన తర్వాత ముందు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. దాంతో ఊపిరితిత్తులకు రక్తం అందటం తగ్గిపోతుంది.

మామూలుగా ఆరోగ్యవంతుల శరీరంలో ఆక్సిజన్ 95 శాతం ఉంటుంది. ఈ శాతం తగ్గితే శ్వాశ తీసుకోవటంలో ఎవరికైనా ఇబ్బందులు మొదలైపోతాయి. కానీ యువతలో కొద్దిరోజుల వరకు ఎలాంటి ఇబ్బందులుండవు. దాంతో తమకేమీ కాలేదనే నిర్లక్ష్యంతో ఉంటున్నారు. అయితే లోలోపల కరోనా ఉదృతి తీవ్రమైపోతుంటుంది. వైరస్ బాగా పెరిగిపోయిన తర్వాత ఆక్సిజన్ సమస్యలు ఒక్కసారిగా మొదలైపోతుంది. అప్పుడు పరుగెత్తుకుంటు ఆసుపత్రులకు వెళుతున్నారు.

ఆసుపత్రులకు చేరుకునేటప్పటికే పరిస్దితి చేయిదాటిపోతోంది కాబట్టి చికిత్స మొదలుపెట్టినా చాలామందిలో ఉపయోగం కనబడటంలేదు. ఈ కారణం వల్లే యువత ఎక్కువగా చనిపోతున్నారు. జ్వరం, అలసట, ఒళ్ళునొప్పుల్లాంటి ఏ లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకోవటం ఒకటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే దేశం యువతను కోల్పోవాల్సుంటుందని హెచ్చరిస్తున్నారు.