Begin typing your search above and press return to search.

సిమ్ కార్డుపైనా ఆధార్ కత్తి

By:  Tupaki Desk   |   10 Sep 2017 5:49 AM GMT
సిమ్ కార్డుపైనా ఆధార్ కత్తి
X
ఫోన్లోని సిమ్ కార్డు నంబరుతో ఆధార్‌ ను అనుసంధానం చేయకుంటే ఇక మొబైల్ సేవలు నిలిచిపోనున్నాయి. సంక్షేమ పథకాలకు - బ్యాంక్ ఖాతాలకు - పాన్ కార్డులకు ఆధార్ లింకేజి చేయిస్తున్న కేంద్రం ఇప్పుడు మొబైల్ వినియోగదారులకూ డెడ్ లైన్ పెట్టింది. ఆధార్-సిమ్ అనుసంధానానికి ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఇచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ లింకేజిని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. అన్ని సిమ్‌ కార్డులను ఆధార్ నంబరుతో నిజనిర్ధారణ చేసుకోవాలని - ఆధార్ నంబరుతో అనుసంధానం కాని సిమ్‌ లను ఫిబ్రవరి 2018 తర్వాత డీయాక్టివేట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్జీవో లోక్‌ నీతి ఫౌండేషన్ వేసిన పిల్‌ ను విచారించిన కోర్టు అప్పట్లో ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన అప్పటి అటార్నీ జనరల్ మాట్లాడుతూ 105 కోట్ల మంది మొబల్ వినియోగదారులు ఉండడంతో దీనికి కొంత సమయం పడుతుందని కోర్టుకు తెలిపారు.

దీంతో కోర్టు ఇందుకు ఏడాది సమయం ఇచ్చింది. కాగా మొత్తం వినియోగదారుల్లో 90 శాతం మంది ప్రీ-పెయిడ్ యూజర్లు ఉన్నారు. ఆధార్-సిమ్ అనుసంధానం వల్ల మోసపూరిత సమాచారం, సిమ్ ల దుర్వినియోగాన్ని నివారించవచ్చని కేంద్రం అనుకుంటోంది.