Begin typing your search above and press return to search.

సింపుల్ గా అమెరికా అధ్య‌క్షుని ప్ర‌మాణం.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   18 Jan 2021 11:30 AM GMT
సింపుల్ గా అమెరికా అధ్య‌క్షుని ప్ర‌మాణం.. రీజ‌న్ ఇదే!
X
అమెరికా అధ్యక్షుడి ప్ర‌మాణ స్వీకారం అంటే అట్ట‌హాసంగా.. అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతుంది. దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. ప్ర‌తిసారీ ఇంత ఆర్భాటంగా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మం.. ఈ సారి నిరాడంబ‌రంగా జ‌రగ‌నుంద‌ని స‌మాచారం. కొత్త అధ్య‌క్షుడు బైడెన్‌ సింపుల్ గా ప్ర‌మాణం చేస్తార‌ట‌.

ప్ర‌ధానంగా కరోనా వైరస్ విజృంభ‌ణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌పంచంలో అత్య‌ధిక కేసులు అమెరికాలోనే న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ల‌క్ష‌లాది మంది ఈ వేడుక‌కు హాజ‌రైతే వైర‌స్ మ‌రింత ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంద‌ని, ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.

జ‌న‌వ‌రి 20వ తేదీన‌ బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. దీనికి చాలా త‌క్కువ స‌మ‌యం ఉండ‌డంతో.. ఏర్పాట్లు మొద‌ల‌య్యాయి. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం నిర్వ‌హించే ప్రాంతానికి స‌మీపంలోని ప్రధాన రోడ్లను మూసివేస్తున్నారు. రెండు రోజులపాటు బ్రిడ్జీలు కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇక, అవ‌స‌ర‌మైన ప్ర‌తి చోటా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2 లక్షలమంది నేషనల్ గార్డులు అత్యంత అప్రమత్తంగా సెక్యూరిటీని పర్యవేక్షించ‌బోతున్నారు.

క్యాపిటల్ బిల్డింగ్ వేదిక‌గా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి మాజీ అధ్య‌క్షులు, ప్రభుత్వ అధికారులు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధాన వేదికమీద మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యు బుష్, బరాక్ ఒబామా ఆసీనులవుతారు. పదవి నుంచి దిగిపోనున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ని కూడా ఆహ్వానం అందుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో లేడీ గాగా అమెరికా జాతీయ గీతం ఆలపిస్తారు. అనంత‌రం 22 ఏళ్ళ ఆఫ్రికన్ అమెరికన్ పోయెట్ అమందా గోర్మన్ కవిత చదివి వినిపిస్తారు. పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ పాప్ గీతం ఆలపిస్తారు. ఇక త్వరలో మాజీ అధ్యక్షుడు కానున్న ట్రంప్ ఎలాగూ బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవ‌కాశం లేదు. ఆయ‌న రావ‌ట్లేదంటూ ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.