Begin typing your search above and press return to search.

సింధు ఫైనల్ మ్యాచ్, ప్రత్యర్ధి వివరాలివే!

By:  Tupaki Desk   |   19 Aug 2016 5:16 AM GMT
సింధు ఫైనల్ మ్యాచ్, ప్రత్యర్ధి వివరాలివే!
X
సమయం: శుక్రవారం రాత్రి 6గంటల 55 నిమిషాలు

టీవీ ఛానల్: స్టార్ స్పోర్ట్స్ 2 & 3

వేదిక: రియో సెంట్రో పెవిలియన్‌

భారతదేశంలోని క్రీడాభిమానులు - దేశాభిమానులు చాలావరకూ టీవీలకు అతుక్కుపోయే సమయం. భారతదేశం తరుపున ఆడుతున్న తొలి ఒలింపిక్స్ లోనే ఫైనల్ వరకూ చేరిన బ్యాండ్మిటన్ క్రీడాకారిని పూసర్ల వెంకట సింధు (21) చరిత్ర సృష్టించే సమయం. ఆ మ్యాచ్ లో గెలిస్తే గోల్డ్ మెడల్డ్ - పొరపాటున ఓడినా కూడా సిల్వర్ మెడల్. భారతదేశపు త్రివర్ణ పతాకం మరోసారి ఒలింపిక్స్ వేదికగా రెపరెపలాడడానికి సిద్ధమైన సమయం. ఆ సమయం కోసం, ఆ క్షణం కోసం కోట్ల గుండెలు ఆశగా ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు.

ఇప్పటికే గురువారం తెల్లవారుజామున రెజ్లర్ సాక్షి మాలిక్‌ కాంస్య పతకంతో మెరిస్తే, అదేరోజు సాయంత్రానికి సింధు తన అద్భుతమైన ఆటతో ఉమెన్స్‌ సింగిల్స్‌ సెమీ ఫైనల్స్‌ కు చేరుకుంది. అనంతరం ఆ మ్యాచ్ ను గెలిచి రియో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ లో ఫైనల్‌ కు చేరి.. తొలి భారత షట్లర్‌ గా చరిత్ర సృష్టించింది. ఇక శుక్రవారం జరిగే తుది పోరులోనూ విజయం సాధిస్తే.. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో సింధు అత్యున్నత స్థాయికి చేరుకున్నట్లే. ఇప్పటికే వెండి పతకం ఖాయమైపోగా.. బంగారమే టార్గెట్ గా సింధూ బరిలోకి దిగనుంది.

సెమీ ఫైనల్స్‌ లో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై వరల్డ్ 10వ ర్యాంక్‌ లో సిందు 21-19 - 21-10తో అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం జరిగే ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌ వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడనుంది. ఇప్పటివరకూ మారిన్ - సింధూలు సుమరు 7 సార్లు తలపడగా.. వాటిలో నాలుగుసార్లు మారియన్ గెలవగా - మూడు సార్లు సింధూ విజయపతాకం ఎగురవేసింది. ఒలింపిక్స్‌ లో వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు భారత్‌ కు స్వర్ణం సాధించిన ఏకైక క్రీడాకారుడు అభినవ్ బింద్రా (2008 బీజింగ్) నిలిచారు. సింధు ఫైనల్స్‌ కు చేరిన అనంతరం అభినవ్ బింద్రా.. "గోల్డ్ క్లబ్‌ లో చేరాలి" అంటూ సింధును తన ట్విట్టర్‌ లో ఆహ్వానించాడు. కాగా.. 2000 సిడ్నీలో కరణం మల్లీశ్వరి - 2012 లండన్‌ లో మేరీకోమ్ లు భారతదేశం తరుపున కాంస్య పతకాలను గెలిచిన సంగతి తెలిసిందే.