Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ఇంట‌ర్నెట్ బంద్‌

By:  Tupaki Desk   |   10 Jun 2016 2:21 PM GMT
ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ఇంట‌ర్నెట్ బంద్‌
X
అవును. స‌ర్కారీ కార్యాల‌యాల్లోఅంత‌ర్జాల సేవ‌ల‌ను నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. అయితే అది మ‌న దేశ ప్ర‌భుత్వ‌మో - రాష్ట్ర ప్ర‌భుత్వ‌మో కాదు. సింగపూర్ ప్రభుత్వం ఈ మేర‌కు నిర్ణయించింది. భద్రతా కారణాలతో ఏడాది పాటు ఇంటర్నెట్ నిలిపివేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో సింగపూర్ ఒకటి. ఆన్‌ లైన్ ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున‌ సేవలు అక్క‌డి ప్ర‌భుత్వం అందిస్తోంది. అయితే సైబర్ దాడులను నిలువరించేందుకు, అనవసరమైన ఇ-మెయిల్స్ ప్రభుత్వ కార్యాలయ కంప్యూటర్లలోకి చొరబడకుండా చూడాలన్న ఉద్దేశంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో లక్ష కంప్యూటర్లపై ప్రభావం పడనున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మందిని ఎంచుకుని వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తామని ఎఎప్ఫీకి లిఖితపూర్వకంగా ఇన్ఫోకామ్ డెవలప్ మెంట్ ఆథారిటీ (ఐడిఎ) వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు ఇంటర్నెట్ నిలిపివేసినా ఆన్‌ లైన్ సేవలకు ఎటువంటి అంతరాయమూ కలగదని అధికార వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ అధికారులు వ్యక్తిగత టాబ్లెట్స్ - స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ తో కనెక్ట్ అవుతారని వెల్లడించాయి. 2014లో ప్రధాన మంత్రి వెబ్‌ సైట్ - అధ్యక్షుడి నివాస వెబ్‌ సైట్‌ పై సైబర్ దాడులు జరగడంతో ఐటి సెక్యూరిటీని సింగపూర్ మరింత కట్టుదిట్టం చేసింది.