Begin typing your search above and press return to search.

విచిత్రం: అక్కడ పిల్లలను కంటే డబ్బులిస్తారట!

By:  Tupaki Desk   |   14 Oct 2020 3:00 PM GMT
విచిత్రం: అక్కడ పిల్లలను కంటే డబ్బులిస్తారట!
X
భారత్-చైనా లాంటి దేశాలు అధిక జనాభాతో ఇబ్బందులు పడుతున్నాయి. జనాభా నియంత్రణకు పాటుపడుతున్నాయి. పిల్లలను కనవద్దని సూచిస్తున్నాయి. కానీ కొన్ని దేశాల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది.

సింగపూర్ లో అందరూ ఉద్యోగాలకు పోతూ డాలర్ల వేటలో పడి సంసారాన్ని చేయకుండా పిల్లలను కనడం లేదట.. దీంతో సింగపూర్ దేశంలో జనాభా భారీగా పడిపోతోందట.. ఈ క్రమంలోనే సింగపూర్ ప్రభుత్వం వివాహమైన జంటలకు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చింది.

పిల్లలను కంటే నగదు బహుమతి ఇస్తామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కారణం ఏంటంటే సింగపూర్ లో జననాల రేటు భారీగా తగ్గుతూ వస్తోందట.. కరోనా కష్టకాలంలో ఈ రేటు ఇంకా తగ్గింది.

కరోనా కష్టకాలంలో జంటలు పిల్లలు కనడాన్ని వాయిదా వేస్తున్నాయట.. ఈ సంక్షోభంలో అది మరింత రిస్క్ అనుకుంటున్నారట.. సింగపూర్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది.

ఇక ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటు ఉన్న దేశం సింగపూర్ అట.. ఈ సమస్య నుంచి బయటపడడానికే అక్కడి ప్రభుత్వం ఇంతకుముందే బీబీ బోనస్ క్యాష్ గిఫ్ట్ స్కీమ్ ను తెచ్చింది. పిల్లలను కన్న వివాహిత జంటలకు పదివేల సింగపూర్ డాలర్లు బహుమతి ఇస్తున్నారు.

‘బేబి సపోర్ట్ గ్రాంట్’ పేరుతో మరో స్కీమ్ ప్రవేశపెట్టారు. అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30 మధ్య పిల్లలను కంటే 3వేల సింగపూర్ డాలర్లు బహుమతిగా ప్రకటించారు.